గాలి జనార్దన్ రెడ్డి భార్య ఆస్తులు ఎన్ని రూ. కోట్లు ?, మైనింగ్ కింగ్ కంటే ఎక్కువే !

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కర్ణాటక కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి దంపతుల పేరుతో ఒక్క కారు కూడా లేదని తెలుసుకున్న ప్రజలు షాక్ అయ్యారు. హెలికాప్టర్ లో తిరుగుతున్న గాలి జనార్దన్ రెడ్డి దంపతుల దగ్గర సొంత కారు కూడా లేదా ? అని కర్ణాటక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలి జనార్దన్ రెడ్డి పేరు చాలా ఫేమస్. కర్ణాటకలో ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డికి అంధ్రప్రదేశ్ లో బంధువులు, తెలంగాణలో (హైదరాబాద్)లో అల్లుడు, తమిళనాడులో అభిమానులు ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి సొంత హెలికాప్టర్ కూడా ఉందని అందరికి తెలుసు.

 Gali Janardhan Reddys wife Gali Lakshmi Aruna

మైనింగ్ కింగ్ గా, కర్ణాటక మంత్రిగా గాలి జనార్దన్ రెడ్డి చాలా ఫేమస్ అయ్యారు. బళ్లారి సిటీ నియోజక వర్గం నుంచి కేఆర్ పీ పార్టీ తరపున గాలి జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం గాలి లక్ష్మీ అరుణ నామినేన్ వేశారు. నామినేషన్ సందర్బంగా లక్ష్మీ అరుణ తన భర్త గాలి జనార్దన్ రెడ్డి నామినేషన్ వేసే సమయంలో తన పక్కన లేరని కన్నీరు పెట్టుకున్నారు.

మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కంటే ఆయన భార్య లక్ష్మీ అరుణ శ్రీమంతురాలు. లక్ష్మీ అరుణ చరాస్తి విలువ రూ. 96. 23 కోట్లు, గాలి జనార్దన్ రెడ్డి చరాస్తి విలువ రూ. 29. 20 కోట్లు. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డికి రూ. 7. 24 కోట్ల చరాస్తు ఉన్నాయని గాలి లక్ష్మీ అరుణ నామినేషన్ సమయంలో అఫిడవిట్ సమర్పించారు.

 Gali Janardhan Reddys wife Gali Lakshmi Aruna

గాలి లక్ష్మీ అరుణకు రూ. 104 కోట్ల స్థిరాస్తి, గాలి జనార్దన్ రెడ్డికి రూ. 8 కోట్ల విలువైన స్థిరాస్తి, గాలి కిరిటీ రెడ్డికి రూ. 1. 24 కోట్ల స్థిరాస్తి ఉందని గాలి లక్ష్మీ అరుణ ఆమె సమర్పించిన అఫిడవిట్ లో సమర్పించారు. గాలి జనార్దన్ రెడ్డి కంటే ఆయన భార్య లక్ష్మీ అరుణకు ఎక్కువ ఆస్తి ఉందని వెలుగు చూసింది. గాలి లక్ష్మీ అరుణకు 84 కేజీల బంగారు, వజ్రాల నగలు ఉన్నాయని, 437 కేజీల వెండి ఉందని, మొత్తం ఆమె ఆస్తి విలువ సుమారు రూ. 250 కోట్లు ఉందని వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+