Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వింత ఆచారాల వినాయకుడు: ఇంకెక్కడా ఉండదు

నేడు వినాయక చవితి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విఘ్న నాయకుడిని ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజిస్తోన్నారు. వీధి వీధినా వినాయకుడి మండపాలు వెలిశాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ లల్లో ఎటు చూసినా కోలాహలం నెలకొంది. పండగ సందడి కనిపిస్తోంది.

రాజస్థాన్ లోని చారిత్రాత్మక రణతంబోర్ కోటలో కొలువైన వినాయకుడి ఆలయానికి ఎక్కడా లేని ప్రత్యేక ఉంది. ఇక్కడ గణేషుడు.. త్రినేత్రుడిగా వెలిశాడు. కుటుంబ సమేతంగా పూజలందుకుంటోన్నాడు. ప్రపంచంలో మరెక్కడే గానీ ఇటువంటి ఆలయం లేకపోవడం విశేషం. గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఈ 700 ఏళ్ల పురాతన ఆలయానికి లక్షలాది మంది భక్తుల సందర్శించుకుంటోన్నారు.

Ganesh Chaturthi 2025 700-Year-Old Ranthambore temple Where Devotees Send Wedding Invites

ఈ ఆలయంలో వినాయకుడితో పాటు ఆయన భార్యలు రిద్ధి, సిద్ధి, తనయులు శుభ్, లాభ్ పూజలందుకుంటారు. 1,300 శతాబ్దం నాటి ఆలయం ఇది. అప్పటి రణతంబోర్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. శత్రువులు తన కోటను ముట్టడించినప్పుడు ఆహార కొరత ఏర్పడిందట. దీన్ని అధిగమించడానికి రాజు గణేశుడిని ప్రార్థించాడు. ఆ రాత్రి ఆయనకు వినాయకుడు కలలో కనిపించి అభయం ఇచ్చినట్లు ప్రతీతి.

మరుసటి రోజు ఉదయం, కోట గోడ నుండి త్రినేత్ర గణేష్ విగ్రహం వెలువడింది. అక్కడి గిడ్డంగులు అన్నీ ఆహార ధాన్యాలతో నిండిపోయాయి. ఈ యుద్ధంలో రణతంబోర్ రాజ్యం విజయం సాధించింది. దీనికి కృతజ్ఞతగా రాజు.. 1,300 శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది.

త్రినేత్రం అంటే మూడు కళ్లు అని అర్థం. గణేశుని ఈ రూపం జ్ఞానం, దివ్య దృష్టి, రక్షణ ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించి, భక్తిశ్రద్ధలతో త్రినేత్ర వినాయకుడికి పూజలు చేసిన వారికి జీవితంలో ఎటువంటి అడ్డంకుల ఉండబోవని, సర్వ విఘ్నాలను అధిగమిస్తారని విశ్వసిస్తారు.

ఇక్కడ మరో వింత ఆచారాన్ని పాటిస్తారు స్థానికులు. కుటుంబంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభ కార్యాల కోసం గణేషుడిని కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తారు. ఆహ్వానపత్రాలు, లేఖలను ఆలయానికి పంపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల వినాయకుడు స్వయంగా వచ్చి తమను ఆశీర్వదిస్తాడని నమ్ముతారు.

త్రినేత్ర గణేష్ ఆలయానికి చేరుకోవడానికి, సమీపంలో ఉన్న విమానాశ్రయం జైపూర్. ఇక్కడి సంగమనేర్ విమానాశ్రయం నుంచి ఈ ఆలయం 180 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. టాక్సీలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి సమీప రైల్వే స్టేషన్- సవాయ్ మాధోపూర్. రైల్వే స్టేషన్ కు ఈ ఆలయం 10 కిలో మీటర్ల దూరం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+