Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Student: 15 ఏళ్ల అమ్మాయిని 8 నెలల గర్బవతి చేసిన రిటైడ్ ఉద్యోగి, ప్రియుడు, బ్లాక్ మెయిల్ తో !

చెన్నై/ క్రిష్ణగిరి/ మదురై: కుటుంబ సభ్యులకు స్థోమతలేదని బంధువుల ఇంట్లో ఉంటు 10వ తరగతి చదువుకుంటున్న 15 ఏళ్ల అమ్మాయి జీవితంతో ముగ్గురు కామాంధులు చెలగాటం ఆడుకున్నారు. మాయమాటలతో ఓ రిటైడ్ ఉద్యోగి, ప్రేమ పేరుతో ప్రియుడు, బ్లాక్ మెయిల్ చేసి ఓ కామాంధుడు కలిసి ఆ అమ్మాయిని 8 నెలల గర్బవతిని చేశారు. అబార్షన్ చేస్తే అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విద్యార్థిని జీవితంతో చెలగాటం ఆడిన ఇద్దరిని అరెస్టు చేసి బెండ్ తీస్తున్న పోలీసులు పారిపోయిన మరో కామాంధుడి కోసం గాలిస్తున్నారు.

 10వ తరగతి అమ్మాయి

10వ తరగతి అమ్మాయి

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా కావేరీపట్టణం సమీపంలోని కుండపాలపట్టి ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యుల చాలా పేదవాళ్లు. ఈ దంపతుల 15 ఏళ్ల కుమార్తెను ఆమె మామ ఇంటిలో పెట్టి 10వ తరగతి చదివిస్తున్నారు. మామ ఇంటిలో ఉంటున్న ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. అమ్మాయి అమాయకురాలు కావడంతో కొందరు కామాంధులు ఆమెపై కన్నువేశారు.

 కడుపు ఎత్తుగా ఉందని అనుమానం

కడుపు ఎత్తుగా ఉందని అనుమానం

ఇటీవల మామ ఇంటి నుంచి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన అమ్మాయి కడుపునొప్పితో బాధపడింది. ఆ సమయంలో కుమార్తె కడుపు ఎత్తుగా ఉందని గుర్తించిన ఆమె తల్లి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అమ్మాయికి వైద్యపరీక్షలు చేశారు. అమ్మాయి 8 నెలల గర్బవతి అని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు.

 రిటైడ్ ఉద్యోగి రిబ్బన్ కటింగ్

రిటైడ్ ఉద్యోగి రిబ్బన్ కటింగ్

అమ్మాయి నివాసం ఉంటున్న మామ ఇంటి పక్కనే ఉదయానన్ (58) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు అమ్మాయి మామ ఇంటికి వెలుతున్న ఉదయానన్ వారి ఇంటిలో నీళ్లు, టీ తాగుతూ బాలికను పరిచయం పెంచుకున్నాడు. ఉదయానన్ ఓ సహాక సంఘంలో ఉద్యోగం చేస్తూ రిటైడ్ అయ్యాడు. అమ్మాయికి మాయమాటలు చెప్పిన ఉదయానన్ ఆమెను బెదిరించి అత్యాచారం చేస్తూ వచ్చాడు. విషయం బయటకు చెబితే నిన్ను చంపేస్తానని బెదిరించిన ఉదయానన్ ఆమెపై పదేపదే లైంగికదాడి చేశాడు.

 ప్రేమ పేరుతో ఒకరు, బ్లాక్ మెయిల్ తో ఒకరు

ప్రేమ పేరుతో ఒకరు, బ్లాక్ మెయిల్ తో ఒకరు

అమ్మాయి నివాసం ఉండే ప్రాంతంలో బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రామరాజ్ అనే యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది. బాలిక, రామరాజ్ వ్యవహారం తెలుసుకున్న శక్తి అనే వ్యక్తి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై అత్యాచారం చేశాడు.

Recommended Video

    MS Dhoni’s Six Cancelled A Pak Cricketer’s 'Date' With An Indian Girl || Oneindia Telugu
     పరిస్థితి చెయ్యి దాటిపోయింది

    పరిస్థితి చెయ్యి దాటిపోయింది

    గత 10 నెలల నుంచి అమ్మాయి మీద ఉదయానన్, రామరాజ్, శక్తి అనే ముగ్గురు కామాంధులు పదేపదే అత్యచారం చెయ్యడం వలనే ఆమె 8 నెలల గర్బవతి అయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రస్తుతం బాలిక 8 నెలల గర్బవతి అని, ఆమెకు ఇప్పుడు అబార్షన్ చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని, ఇప్పటికే పరిస్థితి చెయ్యిదాటి పోయిందని వైద్యులు చెప్పారు. రిటైడ్ ఉద్యోగి ఉదయానన్, రామరాజ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇద్దరికి బెండ్ తీస్తున్నారు. పరారైన శక్తి కోసం గాలిస్తున్నామని కావేరిపట్టణం పోలీసులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+