మరో గ్యాంగ్‌స్టర్ కాల్చివేత- కోర్టులో బుల్లెట్ల వర్షం: మాజీ ఎమ్మెల్యే కుడిభుజం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్ దారుణహత్యకు గురయ్యాడు. కొద్దిరోజుల కిందటే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సమాజ్‌వాది పార్టీ మాజీ లోక్‌సభ సభ్యుడు అతిక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రాఫ్ అహ్మద్ కాల్చివేత ఉదంతాన్ని విస్మరించకముందే- అలాంటి ఉదంతమే మళ్లీ చోటు చేసుకుంది. దీనికి కొద్ది రోజుల ముందే అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్‌ను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు.
ఇప్పుడు తాజాగా మరో గ్యాంగ్‌స్టర్‌ను అతని ప్రత్యర్థులు కాల్చి చంపారు. అతని పేరు సంజీవ్ జీవా. మాజీ శాసన సభ్యుడు ముఖ్తార్ అన్సారీకి కుడిభుజం. లక్నో సిటీ సివిల్ కోర్ట్ ఆవరణలో అతనిపై దుండగులు బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఓ బాలికకు బుల్లెట్ గాయాలయ్యాయి. సంజీవ్ జీవా హత్యతో లక్నోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

సీనియర్ నాయకుడు అవధేష్ రాయ్ హత్యకేసులో ముఖ్తార్ అన్సారీకి రెండు రోజుల కిందటే స్థానిక న్యాయస్థానం పదేళ్ల కారాగారశిక్షను విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన మూడో రోజే ఆయన కుడిభుజం సంజీవ్ జీవా దారుణ హత్యకు గురి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అతని స్వస్థలం ముజఫ్ఫర్ నగర్.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బ్రహ్మదత్ తివారీ, కృష్ణానంద్ రాయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా విచారణను ఎదుర్కొంటోన్నాడు సంజీవ్ జీవా. పోక్సో కేసులో కొద్దిరోజుల కిందట సంజీవ్ జీవా అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో భాగంగా అతను ఇవ్వాళ లక్నో ఖైసర్ బాగ్‌లోని లక్నో కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో అతని చుట్టూ పోలీసులు ఉన్నారు.
కోర్టు ఆవరణలో అడుగుపెట్టిన కొద్దిసేపటికే సంజీవ్ జీవాపై.. నల్లకోటు వేసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. అక్కడే ఉన్న ఓ బాలికకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. దుండగులు బైక్‌పై పారిపోయినట్లు తెలుస్తోంది. వారిలో ఒకడిని పోలీసులు పట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
తన భర్తకు ప్రాణహాని ఉందంటూ రెండు రోజుల కిందటే సంజీవ్ జీవా భార్య పాయల్ మహేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్తార్ అన్సారీకి న్యాయస్థానం పది సంవత్సరాల కారాగార శిక్ష విధించిన సమయంలోనే ఆమె ఈ ప్రకటన చేశారు. తన భర్తకు రక్షణ కల్పించాలని కోరారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications