కరోనా రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య వ్యవధి 6 నెలలే: కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టత
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోస్, ముందు జాగ్రత్త మోతాదు(బూస్టర్ డోసు) మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఉన్న తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించింది.
గత కొన్ని వారాలుగా దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. "శాస్త్రీయ ఆధారాలు, ప్రపంచ అభ్యాసాల దృష్ట్యా, 2వ డోస్, ముందు జాగ్రత్త మోతాదు మధ్య వ్యవధిని సవరించాలని "నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్" (NTAGI) "స్టాండర్డ్ టెక్నికల్ సబ్ కమిటీ" సిఫార్సు చేసింది. ఇప్పటికే ఉన్న తొమ్మిది నెలలు లేదా 39 వారాల నుంచి ఆరు నెలలు లేదా 26 వారాల వరకు తగ్గించింది. దీనిని NTAGI కూడా ఆమోదించింది.

ముఖ్యంగా, ఎన్‌టిఎజిఐ 6-12 ఏళ్ల వయస్సు వారికి కోవాక్సిన్, కార్బెవాక్స్ వ్యాక్సిన్‌లపై డేటాను సమీక్షించి, మోతాదుల మధ్య అంతరాన్ని తగ్గించాలని గతంలో సిఫార్సు చేసింది. దీంతో రెండో డోసు వేసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు వేసుకోవచ్చని తాజా ప్రకటన స్పష్టం చేసింది.
ఇంతకుముందు, 18 ఏళ్లు పైబడిన వారందరూ, రెండవ కోవిడ్ డోస్ ఇచ్చిన తర్వాత తొమ్మిది నెలలు పూర్తయిన వారు కోవిడ్ బూస్టర్ డోస్‌కు అర్హులు. అయితే, విదేశాలకు వెళ్లే వారికి వారు సందర్శించే దేశ అవసరాన్ని బట్టి మినహాయింపు ఇవ్వబడింది.
Union Health Ministry reduces gap for COVID-19 precaution doses from existing 9 months to 6 months for those above 18 years pic.twitter.com/s7YmO3SwZh
— ANI (@ANI) July 6, 2022
ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమయ్యే ప్రైవేట్ టీకా కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లను పొందడానికి 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరూ అర్హులని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8న ప్రకటించింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications