గ్యాస్ సిలిండర్ పై ఎక్స్ పైరీ డేట్.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి.. లేదంటే..?
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. భారత్ లోనూ గ్యాస్ సంక్షోభం నెలకొంది. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తీవ్రమైన గ్యాస్ కొరత కారణంగా చాలామంది వాడకుండా ఎప్పుడో బుక్ చేసుకున్న సిలిండర్స్ ను ఇప్పుడు బయటకు తీసి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల చాలా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలు నమోదవుతున్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్ వద్ద మంటలు రావడం, గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడం జరుగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో అధికారులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
ప్రతి గ్యాస్ సిలిండర్ కు కూడా ఓ ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ ఎక్స్ పైరీ డేట్ సిలిండర్ మీద ముద్రించి ఉంటుందని పేర్కొన్నారు. ఉదాహరణ కు మీ గ్యాస్ సిలిండర్ పై B 22 అని ఉంది అనుకోండి. అంటే ఆ గ్యాస్ సిలిండర్ 2022 సంవత్సరంలోనే ఎక్స్ పైరీ అయిపోతుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత కారణంగా ఇలాంటి ఎక్స్ పైరీ అయిన సిలిండర్లు బయటకు వస్తున్నట్లు తెలిపారు.

గ్యాస్ సిలిండర్లపై ఎక్స్ పైరీ సంవత్సరంతో పాటు తేదీ కూడా ఉంటుంది. అయితే ఆ తేదీ నెంబర్స్ తో కాకుండా ఆల్ఫాబెట్ లోని లెటర్స్ తో ఉంటుంది. ఉదాహరణకు ఒక గ్యాస్ సిలిండర్ పై A29 అని ఉంది అనుకుందాం.. అంటే ఆ గ్యాస్ సిలిండర్ 2029 లో ఎక్స్ పైరీ అవుతుందని అర్థం. అలాగే అక్కడ A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే జనవరి నుంచి మార్చి వరకు ఎక్స్ పైరీ అవుతుందని సమాచారం, B అని ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, C అని ఉంటే జులై నుంచి సెప్టెంబర్ వరకు ఇక చివరగా D అని ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఎక్స్ పైరీ అయిన గ్యాస్ సిలిండర్స్ వాడటం ప్రమాదకరమని తెలిపారు.












Click it and Unblock the Notifications