గే సెక్స్ నేరమే: పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం (గే సెక్స్) నేరమంటూ ఇటీవల ఇచ్చిన తీర్పుపై పునర్‌సమీక్ష జరపాలంటూ దాఖలైన రివ్యూ పిటీషన్లను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరమంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రంతో పాటు పలు హక్కుల సంఘాలు కూడా సవాలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటీషన్లను పరిశీలించిన సుప్రీం కోర్టు మంగళవారం వాటన్నింటినీ తిరస్కరించింది.
కాగా సుప్రీం కోర్టు నిర్ణయం తమకు ఎంతో బాధ కలిగించిందని స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము త్వరలోనే మరో పిటిషన్ వేస్తామని తెలిపారు. ప్రకృతికి విరుద్ధమైన గే సెక్స్ భారత చట్టాల ప్రకారం నేరమంటూ గత డిసెంబరులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీం తిరస్కరించింది.

కాగా గే సెక్స్ చట్ట వ్యతిరేకం కాదంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వేలాది మంది స్వలింగ సంపర్కులు బాహటంగానే బయటికి వచ్చారనీ, ఇలాంటి పరిస్థితుల్లో స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరమంటూ సుప్రీం కోర్టు తీర్పును వెలువరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని హక్కుల కార్యకర్తలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
సుప్రీం తీర్పు స్వలింగ సంపర్కుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని కూడా వారు గట్టిగా వాదించారు. ఈ వాదనకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ కూడా మద్దతు తెలపడం గమనార్హం. సుప్రీం తీర్పు అనేక మంది స్వలింగ సంపర్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications