ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం రూ.1,000ల రిటర్న్ గిఫ్ట్
ఫాస్టాగ్ వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై పరిశుభ్రతను పెంపొందించడానికి ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రమైన మరుగుదొడ్లను గుర్తించి, వాటికి సంబందించిన వివరాలను అందజేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనుంది. 1,000 రూపాయల మొత్తాన్ని వారి ఫాస్టాగ్ ఖాతాలో జమ చేస్తుంది.
ఈ నెల 31వ తేదీ వరకు దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఈ పథకం అమలులో ఉంటుంది. ఇందులో పాల్గొనాలంటే- ఫాస్టాగ్ యూజర్లు తొలుత 'రాజ్‌మార్గ యాత్ర' యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నేషనల్ హైవే అథారిటీ ఆధీనంలో ఉండే టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రమైన మరుగుదొడ్లను జియో ట్యాగ్, టైమ్ ముద్రించి స్పష్టంగా ఫోటోలను తీయాల్సి ఉంటుంది. యాప్‌లో తమ పేరు, లొకేషన్, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్‌ను అందులో పొందుపర్చాలి.

అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ ఆ ఫాస్టాగ్ వినియోగదారులకు 1,000 రూపాయల రివార్డును అందజేస్తుంది. ఈ మొత్తాన్ని ఫాస్టాగ్ అకౌంట్ లో జమ చేస్తుంది. దీన్ని నగదుగా క్లెయిమ్ చేయడం కుదరదు. ఈ పథకం ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించిన లేదా దాని ఆధీనంలో ఉండే టోల్ ప్లాజాల వద్ద గల మరుగుదొడ్లకు మాత్రమే వర్తిస్తుంది. జాతీయ రహదారులపై ఉండే పెట్రోల్ బంకులు, ధాబాల వద్ద ఉండే టాయ్ లెట్లకు ఇది వర్తించదు.
ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ పై ఒక్కసారి మాత్రమే రివార్డును అందుతుంది. ఇదే నంబర్ పై ఇతర ప్రాంతాల్లో ఉండే టోల్ ప్లాజా వద్ద ఉండే మరుగుదొడ్లకు సంబంధించిన వివరాలను పంపించినప్పటికీ.. అందులో ఒక్కటి మాత్రమే ఎంపిక చేస్తుంది ఎన్‌హెచ్‌ఏఐ. ఒకే రోజున పలువురు యూజర్లు ఒకే మరుగుదొడ్డికి సంబంధించిన ఫొటోలు, వివరాలను యాప్ లో అప్ లోడ్ చేస్తే అందులో క్లారిటీగా ఉన్న వాటిని మాత్రమే ఎంపిక చేస్తుంది.
ఆ టాయ్ లెట్లల్లో ఎంత వరకు వాస్తవం ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఏఐ టూల్ ను వినియోగిస్తారు. అలాగే- మాన్యువల్ తనిఖీలు కూడా ఉంటాయి. ఆ ఫొటోలు తప్పనిసరిగా 'రాజ్‌మార్గ యాత్ర' యాప్ ద్వారా తీసినవి అయి ఉండాలి. మార్ఫింగ్ చేసినా లేదా ఫేక్ ఫొటోలు పంపించినా వాటిని పరిశీలనలోకి తీసుకోరు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఎన్‌హెచ్‌ఏ ఈ నిర్ణయం తీసుకుంది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications