Student: లవర్ కు ఫోన్ చేసిన గర్ల్ ఫ్రెండ్, రాంగ్ నెంబర్ తో చాటింగ్, దెబ్బకు బీర్ బాటిల్ !
చెన్నై/టీ నగర్: కాలేజ్ కు వెలుతున్న అమ్మాయికి అదే కాలేజ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. లవర్స్ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ప్రతిరోజు ఇంటికి వెలుతున్న లవర్స్ టైమ్ చూసి ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. రెండు రోజులు లవర్స్ కలుసుకోలేకపోయారు. ప్రియుడితో మాట్లాడాలి అనుకున్న ప్రియురాలు అతనికి ఫోన్ చెయ్యడంతో రాంగ్ నెంబర్ కు వెళ్లింది. ప్రియుడికి చెయ్యవలసిన ఫోన్ పొరపాటున రాంగ్ కాల్ వెళ్లడంతో ఆ ఫోన్ కాల్ కాలేజ్ అమ్మాయి మీద నడిరోడ్డులో బీర్ బాటిల్ తో దాడి చేసే వరకు వెళ్లడం కలకలం రేపింది.

కాలేజ్ లవర్స్
చెన్నై సిటీలోని అవడి సమీపంలోని పట్రాబ్రం ఏరియాలో 16 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. చెన్నైలోని ఓ కాలేజ్ లో ఈ అమ్మాయి నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజ్ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కొన్ని నెలల క్రితం రెండు రోజులు ప్రేమికులు కలుసుకోలేదు. ఆ సందర్బంలో ప్రియురాలు ప్రియుడికి ఫోన్ చెయ్యాలని ప్రయత్నించి వేరే నెంబర్ కు ఫోన్ చేసింది.

రాంగ్ నెంబర్ తో ?
చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లోని క్యాంటిన్ లో పని చేస్తున్న అయ్యప్పన్ (23) అనే యువకుడికి ఫోన్ వెళ్లింది. అయ్యప్పన్ తో మాట్లాడిన కాలేజ్ అమ్మాయి రాంగ్ నెంబర్ అని తెలుసుకుని ఫోన్ కట్ చేసింది. తరువాత అయ్యప్పన్ ఆనెంబర్ కు ఫోన్ చేసి కాలేజ్ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు.

కాలేజ్ అమ్మాయిని లైన్ లో పెట్టి ?
కొన్ని నెలల నుంచి కాలేజ్ అమ్మాయి, అయ్యప్పన్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం అయ్యప్పన్ కాలేజ్ అమ్మాయికి ఫోన్ చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతన్ని పెళ్లి చేసుకుంటానని కాలేజ్ అమ్మాయి చెప్పింది. నువ్వు నన్ను ప్రేమించి నన్నే పెళ్లి చేసుకోవాలని అయ్యప్పన్ ఆమె మీద ఒత్తిడి చేశాడు.

నడిరోడ్డులో బీర్ బాటిల్ తో ?
అయ్యప్పన్ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాలేజ్ అమ్మాయి అతనికి దూరం అయ్యింది. రగిలిపోయిన అయ్యప్పన్ కాలేజ్ అమ్మాయిని అడ్డగించి బీర్ బాటిల్ తో ఆమె తల పగలగొట్టడం కలకలం రేపింది. స్థానికులు విషయం గుర్తించి అయ్యప్పన్ ను పట్టుకుని అంబత్తూరు పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాలైన కాలేజ్ అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించారు.












Click it and Unblock the Notifications