చెత్త కుప్పలో దొరికిందని చేరదీస్తే.. ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

కనిపెంచి పెద్దవాళ్లను చేసిన తల్లిదండ్రులనే ఈ రోజుల్లో పిల్లలు పట్టించుకోవడం లేదు. అలాంటిది ఓ మహిళ.. రోడ్డు పక్కన దొరికిన పసిబిడ్డను పెద్ద మనసుతో తీసుకెళ్లి పెంచుకుంది. కానీ ఆ అమ్మాయే ఆమె పాలిట యమపాశం అవుతుందని అసలు ఊహించలేదు. పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది ఆ అమ్మాయి. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలో జరిగింది.

పుట్టిన మూడు రోజులకే ఆ శిశువును కన్నవారు వద్దనుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తకుప్పలో పడేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న ఓ మహిళకు ఆ శిశువు అరుపులు వినిపించాయి. దగ్గరకు వెళ్లి చూస్తే అమ్మాయి. వెంటనే ఆ మహిళ.. శిశువును తీసుకుని వెళ్లి పెంచుకుంది. ఆ శిశువు పెరిగి పెద్దదయింది. 13 ఏళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే తనను చేరదీసి పెంచిందన్న జాలి, దయ కూడా లేకుండా ఆ అమ్మాయి ప్రవర్తించింది. తోటి స్నేహితులతో కలిసి ఆ మహిళను కిరాతకంగా హతమార్చింది. ఈ దారుణమైన ఘటన ఒడిశాలో జరిగింది.

Girl Brutally Kills Woman She Found on Roadside in Odisha

ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన రాజ్యలక్ష్మి ఖర్(54) దారుణ హత్యకు గురైంది. తాను పెంచిన ఓ అమ్మాయి(13).. స్నేహితులతో కలిసి రాజ్యలక్ష్మిని చంపారు. 13 ఏళ్ల క్రితం ఒడిశాలోనే రోడ్డు పక్కన దొరికిన ఆ అమ్మాయిని చేరదీసి పెంచింది రాజ్యలక్ష్మి. కానీ చివరికి ఆమె చేతిలోనే బలైంది. ఏప్రిల్ 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కారణం ఇదేనా..?

ఆస్తికోసమే రాజ్యలక్ష్మిని ఆ అమ్మాయి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఎవరికీ అనుమానం రాకుండా ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదట దీన్ని హార్ట్ ఎటాక్ గా నమ్మించారు. కానీ పోలీసుల విచారణ అనంతరం హత్యగా నిర్థారించారు.

రాజ్యలక్ష్మి సోదరుడు సిబ ప్రశాద్ మిశ్రా.. ఆ అమ్మాయి మొబైల్ లో చాటింగ్, ఇన్ స్టా గ్రామ్ మెసేజ్ లు చూసి ఇది పథకం ప్రకారం చేశారని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. 13 ఏళ్ల ఆ అమ్మాయి తన ఇద్దరు స్నేహితులు గణేష్ రత్(21), దినేష్ సాహు(20) లతో కలిసి హతమార్చినట్లు తేలింది. రాజ్యలక్షి భర్త గతేడాది మృతి చెందారు. ఇక ఈమె అడ్డు తొలగించుకుంటే ఆస్తి తమ వశం అవుతుందని ముగ్గురూ ప్లాన్ వేశారు. పక్కాగా అమలు చేశారని పోలీసులు విచారణలో తేలింది. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+