మసీదులో రేప్ చేసిన మతపెద్ద, ఇప్పటికే నలుగురు పిల్లలు, నీళ్ల కోసం పంపించిన తల్లి !

న్యూఢిల్లీ: ప్రతిరోజూ మసీదులో తాగునీరు తీసుకురావడానికి వెలుతున్న మహిళ ఇంట్లో పని ఎక్కువ ఉండటంతో ఆమె కూతురుని నీళ్లు తీసుకురావడానికి పంపించింది. చాలా కాలం నుంచి అమ్మాయి మీద కన్ను వేసిన ఆ మసీదు పెద్ద నీళ్లు పట్టుకోవడానికి మసీదు ఆవరణంలోకి వెళ్లిన అమ్మాయికి మాయమాటలు చెప్పి లోపలికి పిలిపించుకున్నాడు. మసీదులోకి వెళ్లిన అమ్మాయి మీద మతపెద్ద అత్యాచారం చేసేశాడని ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మసీదు పెద్దని అరెస్టు చేశారు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న ఆ మసీదు పెద్ద నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

 దేశ రాజధానిలో మసీదు

దేశ రాజధానిలో మసీదు

దేశ రాజధాని ఢిల్లీలో 12 ఏళ్ల బాలిక మీద మత పెద్ద రేప్ చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ఈశాన్య ఢిల్లీలోని ఓ ప్రముఖ మసీదులో రాజస్థాన్ లోని ఘాజియా బాద్ జిల్లాలోని భరత్ పూర్ కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి మత పెద్దగా ఉంటున్నారు. మతపెద్దకు స్థానిక ముస్లీం సోదరులు చాలా గౌరవం ఇస్తున్నారు.

 నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన బాలిక

నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన బాలిక

ప్రతిరోజూ మసీదులో తాగునీరు తీసుకురావడానికి స్థానికంగా నివాసం ఉంటున్న మహిళ వెలుతోంది. ఇంట్లో పని ఎక్కువ ఉండటంతో ఆమె కూతురుని నీళ్లు తీసుకురావడానికి పంపించింది. చాలా కాలం నుంచి అమ్మాయి మీద కన్ను వేసిన ఆ మసీదు పెద్ద నీళ్లు పట్టుకోవడానికి మసీదు ఆవరణంలోకి వచ్చిన అమ్మాయికి మాయమాటలు చెప్పి లోపలికి పిలిపించుకున్నాడు.

 రేప్ చేసి చంపేస్తానని వార్నింగ్ ?

రేప్ చేసి చంపేస్తానని వార్నింగ్ ?

మసీదులోకి వెళ్లిన అమ్మాయి మీద మతపెద్ద అత్యాచారం చేసేశాడని ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు తెలిస్తే నిన్ను చంపేస్తానని మత పెద్ద బాలికను బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 కామాంధుడికి నలుగురు పిల్లలు

కామాంధుడికి నలుగురు పిల్లలు

తన మీద రేప్ కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న మసీదు మత పెద్ద సొంత ఊరికి చెక్కేశాడు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రాజస్థాన్ లోని ఘాజియా బాద్ జిల్లాలోని భరత్ పూర్ కు చేరుకుని మసీదు మత పెద్దను అరెస్టు చేశారు. నిందితుడిని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచామని, అతన్ని 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని పోలీసు అన్నారు. మసీదు పెద్దకు ఇంతకు ముందే వివాహం అయ్యిందని, భార్య, నలుగురు పిల్లలు ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారని PTI వార్త సంస్థ తెలిపింది. కూతురు వయసు ఉన్న అమ్మాయి మీద మసీదు పెద్ద రేప్ చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+