Girl: మైనర్ అమ్మాయి మీద లైంగిక వేధింపులు, సిట్టింగ్ కౌన్సిలర్ అరెస్టు, రాజకీయాలకే కామాంధుడు ఓ మచ్చ !
చెన్నై/ తేన్ కాశీ: పొలిటికల్ లీడర్ గా చలామణి అవుతున్న వ్యక్తి ఆ ప్రాంతంలో కొందరిని లొంగదీసుకుని పెత్తనం చెలాయిస్తున్నాడు. ఒక పార్టీలో చురుకుగా పాల్గొంటున్న అతను ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. కౌన్సిలర్ గా విజయం సాధించిన అతను ఆ ప్రాంతంలోని నివాసం ఉంటున్న వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి వస్తున్నాడు. ఇటీవల స్కూల్ లో చదువుతున్న అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్లింది. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ అమ్మాయి ఇంటి బయట ఆడుకుంటున్నది. ఆ సమయంలో ఆ ఇంటి దగ్గరకు వెళ్లిన కిరాతకుడు మీ అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారు అని ఆ అమ్మాయిని ప్రశ్నించాడు. ఇంట్లో ఎవ్వరూ లేరని అమ్మాయి చెప్పడంతో ఆ అమ్మాయి మీద కన్ను వేసిన కిరాతకుడు ఆమెను ఇంటి లోపలికి పిలుచుకుని వెళ్లాడు.
బాలిక మీద లైంగిక దాడి చేసిన కౌన్సిలర్ ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని అమ్మాయిని బెదిరించి వెళ్లిపోయాడు .ఇటీవల అమ్మాయి తీవ్ర అనారోగ్యానికి గురైయ్యింది. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. బాలిక మీద లైంగిక దాడి జరిగిందని, అందుకే కడుపు నొప్పి వస్తోందని లేడీ డాక్టర్ చెప్పింది. మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి చేసిన కౌన్సిలర్ ను పోలీసులు అరెస్టు చెయ్యడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ఎల్ టీటీఈ లీడర్
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్ టీటీఈ)ని శ్రీలంకలో నిషేధించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఎల్ టీటీఈ పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయి. తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలోని మట్టలంపర ప్రాంతంలో నివాసం ఉంటున్న వీరస్వామి అలియాస్ వీరా (47) ఎల్ టీటీఈ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు.

కామాంధుడు కౌన్సిలర్ అయిపోయాడు
పొలిటికల్ లీడర్ గా చలామణి అవుతున్న వీరస్వామి ఆ ప్రాంతంలో కొందరిని లొంగదీసుకుని పెత్తనం చెలాయిస్తున్నాడు. ఎల్ టీటీఈ పార్టీలో చురుకుగా పాల్గొంటున్న వీరస్వామి గుణరమణల్లూరు పంచాయితీ వార్డు నెంబర్ 15లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశాడు. కౌన్సిలర్ గా విజయం సాధించిన వీరస్వామి ఆ ప్రాంతంలోని నివాసం ఉంటున్న వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి వస్తున్నాడు.

2వ తరగతి అమ్మాయి
ఇటీవల స్కూల్ లో చదువుతున్న అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్లింది. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ అమ్మాయి ఇంటి బయట ఆడుకుంటున్నది. ఆ సమయంలో ఆ ఇంటి దగ్గరకు వెళ్లిన కిరాతకుడు వీరస్వామి మీ అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారు అని ఆ అమ్మాయిని ప్రశ్నించాడు.

లైంగిక దాడి చేసి ఎస్కేప్
ఇంట్లో ఎవ్వరూ లేరని అమ్మాయి చెప్పడంతో ఆ అమ్మాయి మీద కన్ను వేసిన కిరాతకుడు వీరస్వామి ఆమెను ఇంటి లోపలికి పిలుచుకుని వెళ్లాడు. బాలిక మీద లైంగిక దాడి చేసిన కౌన్సిలర్ వీరస్వామి ఈ విషయం బయటకు చెబితే నిన్ను చంపేసి శవాన్ని తీసుకెళ్లి చెరువులో వేస్తానని అమ్మాయిని బెదిరించి వెళ్లిపోయాడు.

అమ్మాయి చెప్పిన మాటకు షాక్ మీద షాక్
ఇటీవల రెండో తరగతి చదువుతున్న అమ్మాయి తీవ్ర అనారోగ్యానికి గురైయ్యింది. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. బాలిక మీద లైంగిక దాడి జరిగిందని, అందుకే కడుపు నొప్పి వస్తోందని లేడీ డాక్టర్ చెప్పింది. తన మీద లైంగిక దాడి చేసింది కౌన్సిలర్ వీరస్వామి అని బాధితురాలు కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పింది. మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి చేసిన కౌన్సిలర్ వీరస్వామిని పోలీసులు అరెస్టు చెయ్యడంతో తేన్ కాశీ జిల్లాతో పాటు తమిళనాడులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications