కోచింగ్ సెంటర్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన యువతి!
ముంబై: తమ కోచింగ్ సెంటర్లో చేరితో బాగా మార్కులు వస్తాయని కోటింగ్ సెంటర్లు ప్రకటనలు గుప్పిస్తుంటాయి. అలాంటి ఓ కోచింగ్ సెంటర్‌కు ముంబైకి చెందిన ఓ యువతి దిమ్మదిరిగే సమాధానం చెప్పింది. ముంబై విద్యార్థిని ఓ ప్రయివేటు కోచింగ్ సెంటర్ పైన రూ.3 లక్షలకు కేసు వేసింది.
అభివ్యక్తి వర్మ అనే విద్యార్థిని హెచ్ఎస్సీ పరీక్షలకు సిద్దమవుతున్నాడు. మ్యాథ్స్, కెమిస్ట్రీ ట్యూషన్ కోసం 2013లో అందేరీలోని ఆక్స్‌ఫర్డ్ ట్యూటర్స్ అకాడమీ కోచింగ్ సెంటరుకు వెళ్లింది. తమ దగ్గర అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉందని వారు చెప్పడంతో హోం ట్యూషన్ పెట్టించుకుంది.
ఫీజు చెల్లించి నెల గడిచినా కెమిస్ట్రీ టీచర్‌ను పంపించలేదు. మ్యాథ్స్ టీచర్‌కు హిందీలో తప్ప ఇంగ్లీషులో చెప్పడం రాదు. విద్యార్థిని చాలాసార్లు వీటి గురించి నిలదీసింది. సరిగా పాఠాలు చెప్పలేదు.

ఒత్తిడికి, గందరగోళానికి గురైన ఆమె టెన్త్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధఇంచలేకపోయింది. ఆమె తల్లి నీనా మాట్లాడుతూ.. తమ కుమార్తెకు కాలేజీ సీటు రావడం కష్టమైందని, దీంతో గత ఏడాది ఆక్స్‌ఫర్డ్ ట్యూటర్స్ అకాడమీపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశామని చెప్పారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ఫోరం గత నెలలో తీర్పు వెలువరించింది. విద్యార్థినికి జరిగిన నష్టానికి రూ.3.64 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఆమె కట్టిన ఫీజు రూ.54,000 తిరిగివ్వాలని, మానసికంగా వేధించినందుకు రూ.3 లక్షలు, కోర్టు ఫీజుల కింద రూ.10వేలు కట్టాలని చెప్పింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications