Girl: స్కూల్ అమ్మాయి, ఆటోలో అరాచకం, పబ్లిక్ గా ? సింగర్స్ కు సినిమా చూపించిన పోలీసులు, సీసీటీవీల్లో !
చెన్నై: అమ్మాయిని బాగా చదవించాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. మద్యతరగతి కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి రోజు ఆటోలో స్కూల్ కు వెళ్లి చదువుకుంటున్నది. ఆటోలో 9వ తరగతి అమ్మాయి స్కూల్ కు బయలుదేరింది. ఆటోలో అప్పటికే ఉన్న ఇద్దరు ఆర్కెస్ట్రా సింగర్స్ అమ్మాయి మీద అనుచితంగా ప్రవర్తించి ఆమెను శారీరకంగా లైంగిక వేధింపులకు గురి చేశారు. తనను లైంగిక వేదింపులకు గురి చెయ్యడమే కాకుండా రెండు వైపుల ఇద్దరు సింగర్స్ కుర్చుని ఉండటంతో తనను కిడ్నాప్ చేస్తున్నారని భయపడిన ఆ అమ్మాయి ఆటోలో నుంచి కిందకు దూకేసింది. వేగంగా వెలుతున్న ఆటోలో నుంచి ఆ అమ్మాయి కిందకు దూకేయడంతో ఆమెకు గాయాలైనాయి. సీసీకెమెరాలు పరిశీలించిన పోలీసులు ఇద్దరు సింగర్స్ ను అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

9వ తరగతి అమ్మాయి
చెన్నై సిటీలోని పుదువన్నార్ పేట్ సమీపంలో 14 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఈ అమ్మాయి తండయూర్ పేట్ లోని ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. అమ్మాయిని బాగా చదవించాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. మద్యతరగతి కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి రోజు ఆటోలో స్కూల్ కు వెళ్లి చదువుకుంటున్నది.

అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన సింగర్స్
ఆటోలో 9వ తరగతి అమ్మాయి స్కూల్ కు బయలుదేరింది. ఆటోలో అప్పటికే ఉన్న ఇద్దరు ఆర్కెస్ట్రా సింగర్స్ డోలక్ జగన్ అలియాస్ జగదీశ్వరన్, కొరుక్కుపేట నివాసి మణికందన్ అలియాస్ మణి రెచ్చిపోయి అమ్మాయికి ఇరు వైపుల కుర్చుని ఆమె మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు.

ఆటోలో నుంచి దూకేసిన అమ్మాయి
సింగర్స్ డోలక్ జగన్, మణి ఆమెను శారీరకంగా లైంగిక వేధింపులకు గురి చేశారు. తనను లైంగిక వేదింపులకు గురి చెయ్యడమే కాకుండా రెండు వైపుల సింగర్స్ డోలక్ జగన్, మణి కుర్చుని ఉండటంతో తనను కిడ్నాప్ చేస్తున్నారని భయపడిన ఆ అమ్మాయి ఆటోలో నుంచి కిందకు దూకేసింది. వేగంగా వెలుతున్న ఆటోలో నుంచి ఆ అమ్మాయి కిందకు దూకేయడంతో ఆమెకు గాయాలైనాయి.

సింగర్స్ కు సినిమా చూపించిన పోలీసులు
అమ్మాయి ఆటోలో నుంచి కిందకు దూకేయడంతో సింగర్స్ డోలక్ జగన్, మణి ఆటో దిగి పరారైనారు. స్కూల్ అమ్మాయి ముక్కు, ముఖం, తలకు తీవ్రగాయాలైనాయి. ఆటో డ్రైవర్ అమ్మాయి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అమ్మాయిని ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్కూల్ అమ్మాయి ప్రయాణించిన రహదారిలోని సీసీకెమెరాలు పరిశీలించిన పోలీసులు ఇద్దరు సింగర్స్ డోలక్ జగన్, మణిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications