Girlfriend: రైల్వేస్టేషన్ లో మాజీ ప్రియుడు ప్రత్యక్షం, కాలేజ్ అమ్మాయిని దారుణంగా పొడిచి చంపేసి !
చెన్నై: కరోనా వైరస్ కట్టడి అయిన తరువాత కోవిడ్ నియమాలు పాటిస్తూ విద్యాసంస్థలు ప్రారంభం అయ్యాయి. ఆన్ లైన్ క్లాసులతో విసిగిపోయిన విద్యార్థులు ఇప్పుడు కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. ఎప్పటిలాగే కాలేజ్ అమ్మాయి ఇంటి నుంచి కాలేజ్ కు బయలుదేరింది. ప్రతిరోజు రైలులో కాలేజ్ కు వెళ్లి వస్తున్న ఆ అమ్మాయి రైలులో ప్రయాణం చెయ్యడానికి సిద్దం అయ్యింది. రైల్వేస్టేషన్ ప్రవేశద్వారంలోకి వెళ్లిన వెంటనే ఆ యువతి మాజీ ప్రేమికుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. మాజీ ప్రియుడిని తప్పించుకుని వెళ్లిపోవడానికి ఆ యువతి ప్రయత్నించింది. ఆ సమయంలో రెచ్చిపోయిన మాజీ ప్రియుడు కత్తి తీసుకుని ఆ యువతిని ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. మాజీ ప్రియురాలిని దారుణంగా పొడిచిన యువకుడు అదే కత్తితో అతను ఇష్టం వచ్చినట్లు పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మాజీ ప్రియుడి అరాచకానికి కాలేజ్ అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైల్వేస్టేషన్ లో ఇలాంటి దారుణం జరగడంతో ప్రయాణికులు హడలిపోయి పరుగు తీశారు.

కాలేజ్ అమ్మాయి
చెన్నైలో శ్వేతా అనే యువతి నివాసం ఉంటున్నది. ఆన్ లైన్ క్లాసులతో విసిగిపోయిన విద్యార్థులు ఇప్పుడు కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. ఎప్పటిలాగే కాలేజ్ అమ్మాయి శ్వేతా గురువారం ఇంటి నుంచి కాలేజ్ కు బయలుదేరింది. శ్వేతాకు ఫోన్ చేసిన ఆమె మాజీ ప్రియుడు మహేష్ నీతో మాట్లాడాలని ఆమెకు చెప్పాడు. అయితే నేను నీతో మాట్లాడనని శ్వేతా మహేష్ కు చెప్పిందని తెలిసింది.

రైల్వేస్టేషన్ లో ప్రత్యక్షం
ప్రతిరోజూ రైలులో కాలేజ్ కు వెళ్లి వస్తున్న శ్వేతా రైలులో ప్రయాణం చెయ్యడానికి సిద్దం అయ్యింది. చెన్నైలోని తాంబరం రైల్వేస్టేషన్ ప్రవేశద్వారంలోకి వెళ్లిన వెంటనే శ్వేతా మాజీ ప్రేమికుడు మహేష్ అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. మాజీ ప్రియుడు మహేష్ నీతో మాట్లాడాలని శ్వేతాకు చెప్పాడు. అయితే మహేష్ ను తప్పించుకుని వెళ్లిపోవడానికి శ్వేతా ప్రయత్నించింది.

వదిలేయాలని వేడుకున్న కాలేజ్ అమ్మాయి
మాజీ ప్రియురాలు శ్వేతాను వదిలిపెట్టడానికి మహేష్ నిరాకరించాడు. ఆ సమయంలో శ్వేతా, మహేష్ ల మద్య మాటామాటా పెరిగిపోయింది. నువ్వు అంటే నాకు ఇష్టం లేదని, ఇంతకుముందు జరిగింది మరిచిపోవాలని, తనను వదిలేయాని శ్వేతా వేడుకుంది. అయితే మాజీ ప్రియురాలు శ్వేతా మాటలను మహేష్ లెక్కచెయ్యలేదు.

నిమిషంలో పొడిచి చంపేశాడు
ఆ సమయంలో రెచ్చిపోయిన మాజీ ప్రియుడు మహేష్ కత్తి తీసుకుని శ్వేతాను ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. చాలా కత్తిపోట్లు పడటంతో శ్వేతా అక్కడే కుప్పకూలిపోయింది. మాజీ ప్రియురాలి శ్వేతాను దారుణంగా పొడిచిన మహేష్ కూడా అదే కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసి ఆమె పక్కనే పడిపోయాడు.

ఐసీయూలో మాజీ ప్రియుడు
ఒక్కసారి షాక్ అయిన రైల్వే పోలీసులు శ్వేతాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్వేతా ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. మహేష్ గొంతుకు 9 కుట్లు వేసిన వైద్యులు అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గతంలో శ్వేతా, మహేష్ కలిసిమెలసి తిరిగారని, తరువాత ఇద్దరి మద్య విభేదాలు రావడంతో విడిపోయారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

సేమ్ సీన్ రిపీట్
2016లో చెన్నైలోని నుంగబాక్కం రైల్వేస్టేషన్ లో స్వాతి అనే యువతిని చెన్నైలోని మీనాక్షీపురంలో నివాసం ఉంటున్న రామ్ కుమార్ అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. స్వాతి హత్య కేసులో పోలీసులు రామ్ కుమార్ ను అరెస్టు చేసి విచారణ చేశారు. ప్రేమ వ్యవహారంలో రామ్ కుమార్ రైల్వేస్టేషన్ లో అందరిముందు స్వాతిని హత్య చేశాడని వెలుగు చూసింది.
Recommended Video

నిన్న స్వాతి..... ఇప్పుడు శ్వేతా
ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే చెన్నైలోని పులల్ జైల్లో ఉన్న రామ్ కుమార్ 2016 సెప్టెంబర్ 17వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. స్వాతిని రామ్ కుమార్ ఎందుకు హత్య చేశాడు అనే విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదు. స్వాతి హత్య టైపులోనే రైల్వేస్టేషన్ లో ఇప్పుడు శ్వేతా కూడా హత్యకు గురికావడంతో చెన్నై ప్రజలు ఉలిక్కిపడ్డారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications