Girlfriend: మాజీ గర్ల్ ఫ్రెండ్ తల నరికి ఊరేగింపుగా వెళ్లిన ప్రియుడు, రెండు నెలల ముందే పెళ్లి, కాలేజ్ అమ్మాయి !
బెంగళూరు/ విజయనగర: సమీప బంధువులలోని యువతి, యువకుడు నిత్యం కలుస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరికి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. పెళ్లి చెయ్యాలని అందరూ అనుకున్నారు. తరువాత పరిస్థితులు తారుమారు కావడంతో పెళ్లి పెటాకులు అయ్యింది. యువతి మాత్రం కాలేజ్ కు వెళ్లి వస్తోంది. ప్రియుడు మాత్రం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని జల్సా చేస్తున్నాడు. పరీక్షలు జరుగుతున్న సందర్బంగా యువతికి కాలేజ్ లో సెలవులు ఇచ్చారు. హాస్టల్ లో ఉంటున్న యువతి పరీక్షలకు చదువుకోవడానికి ఇంటికి వెళ్లింది. తన మాజీ ప్రియురాలు ఇంటికి వచ్చిందని తెలుసుకున్న ప్రియుడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న మాజీ ప్రియురాలిని వేటకొడవలితో నరికేశాడు. మాజీ ప్రియురాలి తల, మొండెం వేరు చేసిన ప్రియుడు అతని కసి తీర్చుకున్నాడు. మద్యహ్నం ప్రియురాలి తల చేతిలో పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రియుడు ఆమె తల ఎస్ఐ టేబుల్ మీద పెట్టి జరిగిన స్టోరీ మొత్తం చెప్పడంతో పోలీసులు హడలిపోయారు.

సమీప బంధువులు
కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని కూడ్లగి తాలుకాలోని కన్నబోరయ్యనహట్టి గ్రామంలో బోజరాజ్ అలియాస్ రాజు (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ఊరిలో నిర్మలా (23) అనే యువతి నివాసం ఉంటున్నది. రాజు, నిర్మలా ఇద్దరు సమీప బంధువులు. చిన్నప్పటి నుంచి రాజు, నిర్మలా చాలా క్లోజ్ గా ఉంటున్నారు.

కాలేజ్ అమ్మాయితో లవ్
నిర్మలా విజయనగరలో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. కాలేజ్ హాస్టల్ లో ఉంటున్న నిర్మలా సెలవుల్లో ఇంటికి వచ్చి వెలుతోంది. సమీప బంధువులు అయిన నిర్మలా, రాజు నిత్యం కలుస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న నిర్మలా, రాజు ప్రేమించుకున్నారు. రాజు, నిర్మలాకు పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. నిర్మలా, రాజుకు పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ అనుకున్నారు.

పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్న ప్రియుడు
పరిస్థితులు తారుమారు కావడంతో నిర్మలా, రాజుల పెళ్లి పెటాకులు అయ్యింది. నిర్మలా, రాజుల మద్య తేడాలు రావడంతో వారి పెళ్లి రద్దు అయ్యిందని బంధువులు అంటున్నారు. నిర్మలా విజయనగరలోనే ఉంటూ కాలేజ్ లో చదువుతోంది. రాజు మాత్రం రెండు నెలల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఊరిలోనే జల్సా చేస్తున్నాడు.

ఇంటికి వెళ్లిన మాజీ ప్రియురాలు
పరీక్షలు జరుగుతున్న సందర్బంగా నిర్మలాకు కాలేజ్ లో సెలవులు ఇచ్చారు. హాస్టల్ లో ఉంటున్న నిర్మలా పరీక్షలకు చదువుకోవడానికి సొంతఊరిలోని ఇంటికి వెళ్లింది. తన మాజీ ప్రియురాలు నిర్మలా ఇంటికి వచ్చిందని తెలుసుకున్న ఆమె మాజీ ప్రియుడు రాజు నేరుగా ఊరికి వెళ్లాడు. నిర్మలా ఇంటి దగ్గరకు వెళ్లిన రాజు ఆమెతో మాట్లాడాడు.

మాజీ ప్రియురాలి తల నరికి ఊరేగింపుగా వెళ్లిన శాడిస్టు
కొంత సేపటి తరువాత రాజు రెచ్చిపోయాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న మాజీ ప్రియురాలు నిర్మలాను రాజు వేటకొడవలితో నరికేశాడు. మాజీ ప్రియురాలు నిర్మలా తల, మొండెం వేరు చేసిన ఆమె మాజీ ప్రియుడు రాజు అతని కసి తీర్చుకున్నాడు. తరువాత మాజీ ప్రియురాలు నిర్మలా తల చేతిలో పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.

ఎందుకు హత్య చేశాడో ?
పోలీస్ స్టేషన్ లో ఆమె తల ఎస్ఐ టేబుల్ మీద పెట్టి జరిగిన స్టోరీ మొత్తం చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. పెళ్లి చేసుకుని భార్యతో ఎంజాయ్ చేస్తున్న రాజు అతని మాజీ ప్రియురాలు నిర్మలాను ఎందుకు దారుణంగా హత్య చేశాడో అని విషయం కచ్చితంగా తెలీయడం లేదని, రాజును విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications