Girlfriend: ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడిని వెంటాడి నరికి చంపేశారు, చెప్పినా వినలేదని !
బెంగళూరు/విజయపుర: వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. మతాలు వేరు అయినా పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు చాలాసార్లు ప్రియుడికి వార్నింగ్ ఇచ్చారు. అయినా ప్రియుడు అతని ప్రియురాలిని రహస్యంగా కలుసుకుంటున్నాడు. ఇక ప్రియుడికి మాటలతో చెబితే అతను వినడని అమ్మాయి కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఎలాగైనా ప్రియుడిని పైలోకాలకు పంపించాలని అమ్మాయి కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. ప్రియుడు అతని ప్రియురాలితో ఊరిబయట ఏకాంతంగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. ప్రియురాలి కళ్ల ముందే ఆమె ప్రియుడిని వెంటాడి వెంటాడి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది. మతాలు వేరుకావడం వలనే ప్రియురాలి కుటుంబ సభ్యులు చేతిలో ఆమె ప్రియుడు దారుణ హత్యకు గురి కావడం, యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ గుమికూడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అక్కడ హత్యలు చెయ్యడం వెన్నతో పెట్టిన విద్య
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని బీమా తీరంలో హత్యలు చెయ్యడం అక్కడ ఉన్న కొందరికి వెన్నతో పెట్టిన విద్య, ఫ్యాక్షన్ హత్యలు, మాఫీయా హత్యలకు ఏమాత్రం తీసిపోని విదంగా బీమా తీరంలో పాతకక్షలు, ప్రతీకారాలతో ఇప్పటికే లెక్కలేనన్న హత్యలు జరిగాయి. బీమా తీరం పేరు చెబితే కొన్ని దశాభ్దాలుగా ఆ పరిసర ప్రాంతాల ప్రజలు హడలిపోతారు అనే విషయం అక్కడి ప్రజలకు కొత్తగా చెప్పనవసరం లేదు.

మూడు సంవత్సరాల ప్రేమ
విజయపుర జిల్లాలోని ఆలమేల తాలుకాలోని బళగనూరు గ్రామంలో రవి నింబరగి అలియాస్ రవి (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రవి నివాసం ఉంటున్న గ్రామంలోనే 26 సంవత్సరాల యువతి నివాసం ఉంటున్నది. రవి, ఆ యువతి మతాలు వేరు. వేర్వేరు మతాలకు చెందిన రవి, ఆ అమ్మాయి మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు.

పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు... కానీ ?
మతాలు వేరు అయినా పెళ్లి చేసుకోవాలని ప్రియుడు రవి, అతని ప్రియురాలు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు చాలాసార్లు ప్రియుడు రవికి వార్నింగ్ ఇచ్చారు. మీ మతం వేరు, మా అమ్మాయి మతం వేరు, నీ పని నువ్వు చేసుకుంటే అందరికి మంచిది అంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు గత ఏడాది నుంచి ప్రియుడు రవికి చెబుతూనే ఉన్నారు.

సీక్రేట్ గా కలుసుకుంటున్న ప్రేమికులు
ప్రియురాలి కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చినా ఆమెతో ప్రియుడు రవి సీక్రేట్ గా కలుస్తున్నాడు. స్నేహితుల సహాయంతో ప్రేమికులు రహస్యంగా కలుసుకుంటున్నారు. ఇక ప్రియుడు రవికి మాటలతో చెబితే అతను వినడని అమ్మాయి కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఎలాగైనా రవిని పైలోకాలకు పంపించాలని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు.

ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడి నరికి చంపేశారు
శనివారం రవి అతని ప్రియురాలితో ఏకాంగా ఊరిబయట ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. ప్రియురాలి కళ్ల ముందే ఆమె ప్రియుడు రవిని వెంటాడి వెంటాడి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది. మతాలు వేరుకావడం వలనే ప్రియురాలి కుటుంబ సభ్యులు చేతిలో ఆమె ప్రియుడు రవి దారుణ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

8 మంది ప్రియుడిని చంపేశారు
రవి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ గుమికూడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న విజయపుర జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రవి కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. రవిని హత్య చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు పరారైనారు. రవిని అమ్మాయి ఫ్యామిలీకి చెందిన 8 మంది అతి కిరాతకంగా హత్య చేశారని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications