Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: వేరే అమ్మాయితో ప్రియుడి రొమాన్స్ వీడియో చూసిన ప్రియురాలు, ఏం చేసిందంటే ?

చెన్నై: ప్రియుడు వేరే అమ్మాయితో తిరగడం మొదలుపెట్టాడు. ప్రియురాలి ఫోన్ కు ఓ ఫ్రెండ్ వీడియో, మెసేజ్ పంపించాడు. తన ప్రియుడు వేరే అమ్మాయితో ఏకాంతంగా రొమాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో చూసిన ప్రియురాలు హడలిపోయింది. నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రియురాలు ఆమె ప్రియుడిని నిలదీసింది. అవును నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఇంతకాలం మనం ఎంజాయ్ చేశాము, ఇంతటితో వదిలేయ్ అని ప్రియుడు చేతులు ఎత్తేశాడు. ప్రియుడు ఏమేమి చేశాడు అని మొత్తం చెప్పి వీడియో తీసిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వేరే అమ్మాయి మోజులో పడి ప్రియురాలి ఆత్మహత్యకు కారణం అయిన ప్రియుడికి ఇప్పుడు హాలీవుడ్ సినిమా కనపడింది.

కాలేజ్ లవర్స్

కాలేజ్ లవర్స్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని మాదవరం ప్రాంతంలో ఏంజెల్ అనే యువతి నివాసం ఉంటున్నది. మనాలి సమీపంలోనే ధనుష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాలేజ్ కు వెళ్లే సమయంలో ఎక్కువ పరిచయం పెంచుకున్న ఏంజెల్, ధనుష్ ప్రేమించుకుంటున్నారు.

 పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు డిసైడ్

పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు డిసైడ్

ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ప్రేమికులు ఏంజెల్, ధనుష్ ఇంతకాలం చాలా సంతోషంగా తిరిగారు. ప్రియుడు ధనుష్ ను పెళ్లి చేసుకోవాలని, పిల్లలు పుట్టిన తరువాత అతనితో కలిసి జీవితాంతం కలసి జీవించాలని అతని ప్రియురాలు ఏంజెల్ రెండు సంవత్సరాల క్రితం డిసైడ్ అయ్యింది.

గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసి ?

గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసి ?

ప్రియురాలు ఏంజెల్ తో శారీరక సంబంధం పెట్టుకున్న ఆమె ప్రియుడు ధనుష్ ఇన్ని సంవత్సరాలు ఆమెతో అతని కోరికలు తీర్చుకున్నాడు. రానురాను ధనుష్ అతని ప్రియురాలు ఏంజెల్ కు దూరం కావడానికి ప్రయత్నించాడు. ఇటీవల ఏంజెల్ ప్రియుడు ధనుష్ చెన్నైలోనే ఉంటున్న వేరే అమ్మాయితో తిరగడం మొదలుపెట్టాడు.

వేరే అమ్మాయితో ప్రియుడు రొమాన్స్ వీడియో చూసి ?

వేరే అమ్మాయితో ప్రియుడు రొమాన్స్ వీడియో చూసి ?

ఇటీవల ఏంజెల్ ఫోన్ కు ఓ ఫ్రెండ్ వీడియో, మెసేజ్ పంపించాడు. తన ప్రియుడు ధనుష్ వేరే అమ్మాయితో ఏకాంతంగా రొమాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో చూసిన ఏంజెల్ హడలిపోయింది. నా ప్రియుడు ధనుష్ నన్ను మోసం చేస్తున్నాడని ఏంజెల కు తెలిసిపోవడంతో ఆమె ఆవేదన చెందింది.

చేతులు ఎత్తేసిన ప్రియుడు

చేతులు ఎత్తేసిన ప్రియుడు

మాట్లాడాలని చెప్పి ప్రియుడు ధనుష్ ను పిలిపించింది. నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరు ఆ అమ్మాయి అంటూ ఏంజెల్ ఆమె ప్రియుడు ధనుష్ ను నిలదీసింది. అవును నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఇంతకాలం మనం ఎంజాయ్ చేశాము, ఇంతటితో వదిలేయ్ అని ప్రియుడు ధనుష్ చేతులు ఎత్తేయడంతో ఏంజెల్ షాక్ అయ్యింది.

 వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

ఇంతకాలం తన ప్రియుడు ధనుష్ తనను శారీరకంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని, వాడు అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని, వాడికి పోలీసులు సరైన బుద్ది చెప్పాలని ఆవేదనతో చెప్పి వీడియో తీసిన ఏంజెల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 ప్రియుడు గ్రేట్ ఎస్కేప్

ప్రియుడు గ్రేట్ ఎస్కేప్

వేరే అమ్మాయి మోజులో పడి ప్రియురాలు ఏంజెల్ ఆత్మహత్యకు కారణం అయిన ఆమె ప్రియుడు ధనుష్ ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్రియుడు మోసం చేశాడని ఏంజెల్ ఆత్మహత్య చేసుకోవడంతో చెన్నైలోని మనాలి ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+