Girls: అమ్మాయిలతో తిక్కచేష్టలు, ఫోన్ నెంబర్లు కావాలని ?, 9 ఏళ్లకు దూలతీరిపోయింది, జైల్లో !
ముంబాయి/ అంధేరి: ఇద్దరు అమ్మాయిలు సాయంత్రం నడుచుకుంటూ వెలుతున్నారు. అమ్మాయిలు మాత్రమే వెలుతున్న విషయం గమనించిన ఇద్దరు యువకులు కొంతదూరం వాళ్ల వెంటపడ్డారు. తమను ఎవరో ఫాలో అవుతున్నారని తెలుసుకున్న అమ్మాయిలు పరుగు తీశారు. అయితే అమ్మాయిలను రోడ్డు మీద వెంబడించిన యువకులు వాళ్ల మొబైల్ ఫోన్ నెంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొబైల్ ఫోన్ నెంబర్లు ఇవ్వకుంటే రేపటి నుంచి ఈ ఏరియాలో తిరగనివ్వమని అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చారు. అక్కడ సీన్ కటే చేస్తే పోటుగాళ్లు ఇద్దరికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.

9 సంవత్సరాల క్రితం !
మహారాష్ట్రలోని అంధేరి ప్రాంతంలో 2013 నవంబర్ 25వ తేదీన సాయంత్రం ఇద్దరు అమ్మాయిలు సాయంత్రం నడుచుకుంటూ వెలుతున్నారు. అమ్మాయిలు మాత్రమే వెలుతున్న విషయం గమనించిన ఇద్దరు యువకులు కొంతదూరం వాళ్ల వెంటపడ్డారు. ఎవరో మా వెనుక నడుచుకుంటూ వస్తున్నారని మొదట ఆ అమ్మాయిలు పెద్దగా పట్టించుకోలేదు.

అమ్మాయిలను వెంబడించి ?
చాలా దూరం నడుచుకుంటూ వెలుతున్న అమ్మాయిల వెంట వెలుతున్న యువకులు అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. తమను ఎవరో ఫాలో అవుతున్నారని తెలుసుకున్న అమ్మాయిలు రోడ్డు మీద పరుగు తీశారు. అమ్మాయిలను రోడ్డు మీద వెంబడించిన యువకులు కొంతదూరం వెళ్లిన తరువాత ఇద్దరు అమ్మాయిలు కదలకుండా అడ్డుకున్నారు.

ఫోన్ నెంబర్లు ఇవ్వకుంటే ?
అమ్మాయిలను అడ్డుకుని వాళ్ల మొబైల్ ఫోన్ నెంబర్లు ఇవ్వాలని ఆ ఇద్దరు యువకులు డిమాండ్ చేశారు. మొబైల్ ఫోన్ నెంబర్లు ఇవ్వకుంటే రేపటి నుంచి ఈ ఏరియాలో తిరగనివ్వమని అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఓ అమ్మాయి సోదరుడు సమీపంలోని బస్ స్టాప్ దగ్గర ఉన్న విషయం గమనించిన అమ్మాయిలు అక్కడికి పరగుతీసి అతనికి జరిగిన విషయం చెప్పారు. అంధేరి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు.

మైనర్ అమ్మాయి దెబ్బతో జైలు శిక్ష
ఇద్దరు అమ్మాయిల్లో ఓ అమ్మాయికి 17 సంవత్సరాల వయసు ఉండటంతో పోలీసులు ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. అమ్మాయిలో ఇద్దరు అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించారని వెలుగు చూడటంతో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించారని అంధేరి పోలీసులు తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ జయశ్రీ నిందితులకు శిక్ష విధించారని అంధేరి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications