వివాదాస్పదం: 'అలా చేస్తే రేప్ చేయాలని ఆబ్బాయిలను ఆహ్వానించినట్టే'

రాయ్‌పూర్: కేంద్రీయ విద్యాలయ స్కూల్‌లో ఓ సైన్స్ టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందాలను చూపించే వస్త్రాలు ధరిస్తే తమపై లైంగిక దాడికి ఆహ్వనించినట్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొట్టి వస్త్రాలు వేసుకొని అందాన్ని ప్రదర్శిస్తే నిర్భయ లాంటి ఘటనలు చోటు చేసుకొంటాయన్నారు దీంతో టీచర్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

రాయ్‌పూర్‌లోని ఓ కేంద్రీయ విద్యాలయంలో స్నేహలత శంఖ్వార్ అనే సైన్స్ టీచర్ తొమ్మిది, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థినులకు ఆమె సలహలిచ్చారు.

Girls wearing lipstick, short dress are asking for Nirbhaya type rape: KV's teacher

అమ్మాయిలు జీన్స్ వేసుకొని, లిప్‌స్టిక్ పెట్టుకొంటే ప్రమాదమన్నారు. అలా చేసే వారిపై నిర్భయదాడి ఘటనలు జరుగుతాయని, పరోక్షంగా లైంగిక దాడికి ఆహ్వనించినట్టేనని సైన్స్ టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అందమైన ముఖాలు లేనప్పుడు మాత్రమే అమ్మాయిలు తమ శరీరాన్ని బయటకు చూపించాలని సైన్స్ టీచర్ వ్యాఖ్యానించారు.. అమ్మాయిలు మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నారన్నారు.

ఇలాంటి సంఘటనలు ఒకవేళ అమ్మాయిలు ఎదుర్కొంటున్నారంటే అది వారు చేసిన పాపాలకు అనుభవించే శిక్ష తప్ప మరొకటి కాదు. ఏ అమ్మాయి తన శరీరాన్ని బయటకు చూపాలని ఆరాటపడుతుందో ఆ అమ్మాయిని ఒకబ్బాయి క్యారెక్టర్‌ లేని అమ్మాయనే అనుకుంటాడని ఆ టీచర్ అభిప్రాయపడింది.

అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+