అలా అయితే.. దేశం విడిచి వెళ్లిపోవచ్చు: అన్సారీపై ఆర్ఎస్ఎస్ సంచలన కామెంట్స్!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు అభద్రతా భావంలో ఉన్నారన్న హమీద్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. అలా అయితే ముస్లింలు తమకు సురక్షితం అనిపించే మరో దేశానికి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని అన్నారు.

ఉపరాష్ట్రపతిగా వైదొలుగుతున్న సమయంలో హమీద్ అన్సారీ ముస్లింల భద్రతపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంద్రేష్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన తనకు ఎక్కడ పూర్తి స్వేచ్చ, భద్రత లభిస్తాయని భావిస్తారో అక్కడికి వెళ్లిపోవచ్చునని అన్నారు.

Go where you feel secure, RSS’s Indresh Kumar tells Hamid Ansari

అన్సారీ సహా అభద్రతా భావంలో ఉన్న భారతీయ ముస్లింలంతా సురక్షితంగా ఉన్న దేశం పేరు వెల్లడించి, ఇక్కడి నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని ఇంద్రేష్ అన్నారు. నాగ్ పూర్ లో జరిగిన ఓ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

హమీద్ అన్సారీ వ్యాఖ్యలను దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని కూడా ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. పదేళ్లుగా లౌకిక వాదిగా ఉన్న అన్సారీ పదవీ విరమణ చేయగానే కుహనా లౌకికవాదిగా మారారని విస్మయం వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior RSS leader Indresh Kumar on Saturday advised former Vice President Hamid Ansari to go to any country “where he feels secure”.
Please Wait while comments are loading...