బిల్డప్ బాబాయికే బాబు వీడు.. రాష్ట్ర మంత్రినంటూ అందర్నీ బురిడీ కొట్టించాడు.. చివరికి..
కోతల రాయుడికి తాత లాంటివాడు బిల్డప్ బాబాయి అనుకుంటే.. ఆ బాబాయినే మించిన బడుద్ధాయి వీడు. మామూలుగా మోసం కేసుల్ని మనం చాలా చూసుంటాం. పోలీసులమనో, సీబీఐ, సీఐడీ లేదా ఐటీ అధికారులమనో చెప్పుకుంటూ అవతలివాళ్లని బురిడే కొట్టించే బాపతుగాళ్ల గురించి వార్తల్లో చదువుతుంటాం. వీడు మాత్రం ఏకంగా తాను మంత్రినని చెప్పుకుని దర్జాలు అనుభవించాడు.

అనుభవించురాజా..
ఉత్తరప్రదేశ్ కు చెందిన సునీల్ సింగ్.. తాను ఉత్తరప్రదేశ్ మంత్రినంటూ ఫేక్ డాక్యుమెంట్లతో గోవా ప్రభుత్వాన్ని బురిడీకొట్టించాడు. వీడిచ్చిన బిల్డప్పును నమ్మిన గోవా అధికారులు.. పనాజీలోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో బస ఏర్పాటుచేసింది. 12 రోజులపాటు రాజభోగాలు అనుభవించిన తర్వాతగానీ అసలు బండారం బయటపడలేదు.

సీఎంకు అనుమానం రావడంతో..
యూపీ రాష్ట్రమంత్రి హోదాలో గోవా సీఎంతో మంతనాలు జరుపుతానంటూ సునీల్ సింగ్ సీఎంవోకు ఒక లేఖ రాశాడు. ఆ లెటర్ ను పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు ఎక్కడో అనుమానమొచ్చింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని పురమాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.

అంతకు ముందే ఓ మంత్రితో భేటీ
పోలీసులకు పట్టుపడటానికి మూడ్రోజుల ముందు ఈ నకిలీ మంత్రి.. గోవా రాష్ట్రమంత్రితో భేటీ అయి పలు అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన చర్చలు జరిపాడట. దీనిపై గోవా మంత్రిని వివరణ కోరగా.. ‘‘నాకెలా తెలుస్తుంది బాబూ వాడు నకిలీనో కాదో అని? అధికారులు చెప్పారు.. ఆ మేరకు మాట్లాడాను. అదీ కూడా పది నిమిషాల్లోనే మీటింగ్ ముగిసింది''అని వాపోయారు. అయినా.. నకిలీ మంత్రిగా బిల్డప్ ఇవ్వడమే నేరం.. పైగా సీఎంతో స్పెషల్ మీటింగులేంటి? మరీ మితిమీరిన బిల్డప్ కాకపోతే!!
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications