భార్యను వదిలి హనీమూన్ వెళ్లిన భర్త: సుష్మా స్వరాజ్ హామీ

న్యూఢిల్లీ: ఓ నవ వరుడు పంపిన ట్వీట్ కు స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించారు. నీ భార్యను హనీమూన్ కు పంపిస్తామని నీవు అక్కడే ఉండాలని సుష్మా స్వరాజ్ నవ వరుడికి హామి ఇచ్చారు.

బాలీవుడ్ సినిమా క్వీన్ తరహాలో ఈ నవ వరుడి కథ జరిగింది. ఇటీవల ఢిల్లీకి చెందిన ఫైజాన్ పటేల్, సానా అనే ఇద్దరి వివాహం జరిగింది. ఇద్దరు హనీమూన్ కు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.

నవ దంపతులు యూరప్ వెళ్లేందుకు సిద్దం అయ్యారు. అంతలోనే వీరు షాక్ కు గురైనారు. సానా పాస్ పోర్టు కనపడకపోవడంతో ఆయోమయానికి గురైనారు. హనీమూన్ ట్రిప్ రద్దు చేసుకోవాలని పెద్దలు సలహా ఇచ్చారు.

Husband goes alone on honeymoon,Your wife will be there:Susshma Swaraj

అయితే ఫైజాన్ పటేల్ ఒంటరిగా హనీమూన్ వెళ్లడానికి సిద్దం అయ్యాడు. తన భార్య సానా ఫోటో పట్టుకున్నాడు. ఒంటరిగా వెలుతున్నాను అనే ఫీలింగ్ రాకుండా విమానంలో అతను కుర్చున్న పక్క సీట్ లో భార్య ఫోటో పెట్టుకున్నాడు.

తరువాత భార్య ఫోటోతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోను భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేశాడు. అతని పరిస్థితి ట్వీట్ ద్వారా సుష్మా స్వరాజ్ కు చెప్పాడు. సహాయం చెయ్యాలని మనవి చేశాడు. వివరాలు తెలుసుకున్న సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించారు.

సానా ను నీ దగ్గరకు పంపిస్తామని అతనికి భరోసా ఇచ్చారు. సానాకు డూప్లికేట్ పాస్ పోర్టు అందిస్తారని అతనికి హామీ ఇస్తూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. సానాకు తగిన సహాయం చెయ్యాలని తన కార్యాలయం అధికారులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+