రైల్వే ప్రయాణికులకు శుభవార్త
UTS ద్వారా మొబైల్ లోనే టికెట్ బుక్ చేసి టీటీఈకి చూపించవచ్చు
యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో రైలు టికెట్లు బుక్ చేసే వారికి కాస్తంత ఊరట కలిగింది. క్యూలో నిల్చొనే అవసరం లేకుండా యూటీఎస్ మొబైల్ యాప్ లో జనరల్ టికెట్లను పొందే వీలున్న సంగతి తెలిసిందే. అది గతంలో 5 కిలోమీటర్ల పరిధి కలిగివుండేది. ఇప్పుడు ప్రయాణికుల కోరిక మేరకు పరిధిని 20 కిలోమీటర్లకు రైల్వే పెంచింది.

ఫోన్ లోనే టికెట్ చూపిస్తే చాలు..
అన్ రిజర్వ్ డ్ టికెట్లను యూటీఎస్ ద్వారా అందరూ ఇప్పుడు బుక్ చేసుకుంటున్నారు. రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్నప్పుడు మాత్రం టికెట్లను పొందాల్సి ఉంటుంది. క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్‌లో రైలు టికెట్లు బుక్ చేసి, ట్రైన్ టికెట్ ఎగ్జామినర్‌కు ఫోన్‌లో టికెట్ చూపిస్తే చాలు.
సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రూపొందించిన ఈ యాప్‌ను మనదేశంలో దాదాపు రెండుకోట్ల మందికిపైగా ప్రయాణికులు ఉపయోగిస్తున్నారు.

క్యూ లో నిలబడాల్సిన శ్రమ లేదు..
ఉదాహరణకు ఓ రైల్వే ప్రయాణికుడు రైలులో విజయవాడ నుంచి వరంగల్‌కు వెళ్లాలనుకుంటే ఐఆర్‌సీటీసీ యాప్‌లో స్లీపర్, ఏసీ కోచ్‌లల్లో ట్రైన్ టికెట్ ముందుగా బుక్ చేసుకుంటే ఆ టికెట్‌ను రిజర్వ్‌డ్ టికెట్ అంటారు. రిజర్వేషన్ తో సంబంధం లేకుండా రైల్వే కౌంటర్‌కు వెళ్లి జనరల్ బోగీలో ప్రయాణించడానికి టికెట్ తీసుకుంటే దాన్ని అన్‌రిజర్వ్‌డ్ టికెట్ అంటారు.
రైలులో ఉండే అన్‌రిజర్వ్‌డ్ బోగీలో ప్రయాణించడానికి ఈ టికెట్ ఇస్తారు. క్యూలో నిల్చొనే అవసరం లేకుండా యాప్ ద్వారా అందరూ ఇప్పుడు సులభంగా పొందుతున్నారు.

2 నుంచి 5 కిలోమీటర్ల పరిధి ఉండాలి
అయితే రైలు ఎక్కాల్సిన స్టేషన్ కు దగ్గర్లో ఉండి వీటిని పొందాల్సి ఉంటుంది. గతంలో నాన్ అర్బన్ ప్రాంతాల పరిధి 5 కిలోమీటర్ల వరకు ఉండగా దాన్ని 20 కిలోమీటర్లకు పెంచారు. అలాగే అర్బన్ పరిధిలో 2 కిలోమీటర్లుగా ఉన్న పరిధిని 5 కిలోమీటర్లకు పెంచారు.
మన ఫోన్ లో జీపీఎస్ ఆన్ లో ఉంటేనే యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ బుక్కవుతుంది. రైల్వే ప్రయాణికులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యూటీఎస్ యాప్ డౌన్‌లోడ్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి లాగిన్ అవ్వాలి. మొదటిసారి ఈ యాప్ ను ఉపయోగించేవారైతే రిజిస్టర్ చేసుకోవాలి.
లాగిన్ అయిన తర్వాత మీకు 5 ఆప్షన్స్ కనిపిస్తాయి. నార్మల్ బుకింగ్ సీజన్ బుకింగ్, క్యూ ఆర్ బుకింగ్, క్విక్ బుకింగ్, ప్లాట్ ఫామ్ బుకింగ్... లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు ప్రయాణం చేయాలనుకుంటున్నారో వివరాలు నమోదుచేస్తే చాలు.. ఫోన్ లోనే టీసీకి టికెట్ చూపించవచ్చు. ప్రింట్ కావాలంటే ప్రింట్ మోడ్ ఆప్షన్ లో టికెట్ తీసుకొని దాన్ని ప్రింట్ తీయించి టీసీకి చూపించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications