రష్యా-ఉక్రెయిన్ పోరుతో భారత్ కు లాభం- కనీవినీ ఎరుగని రీతిలో-రిలయన్స్ మినహా అందరికీ..
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రలో భారత్ మౌనం మనదేశానికి భారీగా కలిసివచ్చేలా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రష్యా.. తన చమురును సైతం ఇతర దేశాలకు అమ్ముకోలేని పరిస్ధితుల్లో ఉంది. ఇలాంటి తరుణంలో భారత్ కు భారీ డిస్కౌంట్ తో చమురును అమ్మేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. దీంతో భారతీయ చమురు సంస్ధలు భారీగా లబ్ధి పొందబోతున్నాయి. అదేసమయంలో భారత్-రష్యా మధ్య చమురు బంధం కూడా విస్తరించే అవకాశముంది.
Recommended Video


భారత్ కు మేలు చేస్తున్న ఉక్రెయిన్ వార్
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర భారత్ కు పరోక్షంగా మేలు చేస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధంపై భారత్ తటస్ధ వైఖరి అనుసరిస్తుండటం రష్యాకు కలిసి వస్తోంది. యూఎస్ తో పాటు పశ్చిమదేశాలన్నీ ముప్పేటదాడి చేస్తున్న వేళ భారత్ వైఖరి రష్యాకు ఉపయోగపడుతోంది. దీంతో పాటు రష్యాకు భారత్ మరో మేలు కూడా చేస్తోంది. రష్యా చమురును ఇతర దేశాలు కొనకుండా పశ్చిమదేశాలు ఆంక్షలు విధిస్తున్న వేళ.. ఆ చమురును డిస్కౌంట్ పై కొనుగోలు చేసేందుకు ముందుకొస్తోంది. దీంతో ఆ మేరకు రష్యాకు ఆర్ధికంగా లాభం కలగబోతోంది. ఫైనల్ గా ఇది భారత్ కు కూడా భారీగా మేలు చేస్తోంది.

భారత్ కు బంపర్ ఆఫర్
అసలే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. రష్యా-ఉక్రెయన్ యుద్ధాన్ని బూచిగా చూపి చమురు ధరలు పెంచేస్తున్న పరిస్దితి. ఇలాంటి తరుణంలో రష్యా నుంచి చౌక ధరకు లభిస్తున్న చమురును కొనుగోలు చేయడం భారత్ కు అన్నివిధాలా మేలు చేయబోతోంది. ప్రభుత్వానికి ఆయిల్ పూల్ లోటు పూడ్చుకోవడంతో పాటు చమురు సంస్ధలు కూడా ఆర్ధికంగా బలోపేతం కాబోతున్నాయి. అటు వినియోగదారులకు సైతం తక్కువ ధరకు పెట్రోల్ సరఫరా చేస్తే వారికి కూడా మేలు జరుగుతోంది. అలా ఎటు చూసినా భారత్ కు ఇది శుభసూచికంగానే కనిపిస్తోంది.

రష్యాతో చమురు బంధం బలోపేతం
రష్యా అంటే ఇప్పటివరకూ భారత్ కు చిరకాల మిత్రదేశమే అయినా దశాబ్దాలుగా వారి ఆయుధాలు మనకు అమ్మేందుకు మాత్రమే వాడుకుంది. ఇప్పుడు చమురు అమ్ముకోవడానికి వాడుకుంటోంది. అయినా ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రష్యా ఆయుధాలు ఇవ్వకపోయినా మరో దేశం మనకు వాటిని సరఫరా చేస్తుంది. కానీ ప్రపంచ చమురు ఎగుమతుల్లో రెండో స్ధానంలో ఉన్న రష్యా నుంచి భారత్ కు చమురు సరఫరా జరగడం, అదీ డిస్కౌంట్ ధరలకు జరగడం వల్ల భారత్ కు భారీగా మేలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయ చమురు సంస్ధలు బలోపేతం అయ్యే అవకాశముంది. ఇలా సుదీర్ధ చమురు బంధం ఏర్పడితే భారత్ చమురు కోసం మిగతా దేశాలపై ఆధారపడటం దాదాపుగా తగ్గించేసుకోవచ్చు కూడా. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రెండు మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

రిలయన్స్ ఎందుకు కొనట్లేదంటే ?
భారతీయ చమురు సంస్ధలన్నీ ఇప్పుడు రష్యా ఇస్తున్న డిస్కౌంట్ కు చమురు కొనుగోళ్లకు తెరలేపుతుంటే భారత్ లో అతిపెద్ద చమురు రిపైనరీలను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యా నుంచి కొనుగోలు చేసే పరిస్ధితుల్లో లేదు. ఎందుకంటే ఇప్పటికే అమెరికాతో సుదీర్ఘ చమురు బంధాన్ని కలిగి ఉన్న రిలయన్స్ సంస్ధ.. ఇప్పుడు రష్యా నుంచి తక్కువకు వస్తున్న చమురు తీసుకుంటే రష్యాపై యూఎస్ విధించిన ఆంక్షల ప్రభావం దానిపై పడటం ఖాయం.అప్పుడు రిలయన్స్ కు భారీ ఇబ్బందులు తప్పవు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో రిలయన్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications