నిముషానికి గూగుల్ ఎంత సంపాదిస్తుందో తెలుసా?
వాస్తవం మాట్లాడుకోవాలంటే మన జీవితంలో గూగుల్ భాగమవలేదు. మనమే గూగుల్ పై ఆధారపడేలా ఆ కంపెనీ చేసుకుంది. గూగుల్ నుంచి సెర్చింజన్ తోపాటు మ్యాప్స్ ఉన్నాయి.. యూట్యూబ్ ఉంది.. ఇలా ఏది అందిస్తున్నా అంతా ఉచితమే. ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రీమియం సేవలు పొందాలంటే డబ్బులు చెల్లించాలి. ఇలా ఆ కంపెనీ ఆదాయం భారీగా ఉంటుంది. అన్ని సేవలు ఉచితంగానే ఇస్తున్నప్పటికీ భారీగా డబ్బును సంపాదించడం ఎలా సాధ్యపడుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ కంపెనీ ఏ ప్రాజెక్టు చేపట్టినా అది భారీ విజయం సాధించడమేకాదు.. లక్షల కోట్లరూపాయల ఆదాయాన్ని తెచ్చుకుంటోంది.
కోట్ల లింకులతో రూ.కోట్ల ఆదాయం
గూగుల్ కు ఆదాయం వాణిజ్య ప్రకటనలద్వారా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అనేక రకాల విషయాలను తెలుసుకోవడానికి గూగుల్ లో శోధిస్తుంటారు. గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అక్కడ రెండు లింక్స్ వస్తాయి. వాటి నుంచి మరో మూడు లింకులు ఇతర లింకులకు వస్తాయి. ఇలా ప్రజలు గూగుల్ లో ఎన్నిసార్లు అన్ని కోట్లసార్లు ఆదాయం వస్తుంది. వీటికితోడు యూట్యూబ్ లో కోట్లరూపాయల ఆదాయం కోట్ల సంఖ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనల ద్వారా వస్తుంది.

ప్లేస్టోర్ నుంచి భారీ ఆదాయం
గూగుల్ ఒక దశ వరకు అన్ని సేవలు ఉచితంగా అందిస్తుంటుంది. పరిమితి దాటిని తర్వాత సేవలను పొందాలనుకుంటే మనం తిరిగి డబ్బులు చెల్లించాలి. మనకుండే జీమెయిల్ ఖాతాల్లో 15జీబీ డేటా ఉచితంగా ఇస్తుంది. అంతకుమించి కావాలంటే డబ్బులు చెల్లించాలి. అలా ఆదాయం వస్తుంటుంది. మొబైల్ కంపెనీలు తాము తయారుచేసే ఫోన్లలో గూగుల్ యాప్స్ ను ఇన్ బిల్ట్, డీఫాల్ట్ గా ఉంచేందుకు ఈ కంపెనీలన్నీ గూగుల్ కు డబ్బులు చెల్లిస్తాయి. అలా యాప్స్ ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గూగుల్ ప్లేస్టోర్ ఉపయోగించాలన్నా కంపెనీలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ యాప్స్ అన్నీ ఒకేచోట పొందేందుకు గూగుల్ ప్లేస్టోర్ ఉంది. ఇందులో కోట్ల సంఖ్యలో యాప్స్ ఉంటాయి. వీటిద్వారా కూడా గూగుల్ కంపెనీ భారీగా లాభాలను ఆర్జిస్తోంది. ఒక నివేదిక ప్రకారం గూగుల్ కంపెనీ నిముషానికి రూ.2 కోట్లు సంపాదిస్తోంది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications