వ్యభిచారానికి ఉపయోగిస్తున్న 240 వెబ్‌సైట్లపై నిషేధం

న్యూఢిల్లీ: వ్యభిచారానికి ఆన్‌లైన్‌లో ఉపయోగిస్తున్న 240 ఎస్కార్ట్ సర్వీస్ వెబ్‌సైట్లను కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరక హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణల కమిటీ సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.

ఎస్కార్ట్ సర్వీసులను అందిస్తున్న 240 వెబ్‌సైట్లను తక్షణమే నిలిపివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను సోమవారం ఆదేశించినట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీకి తెలిపాలని ఆయన సూచించారు.

అయితే ప్రభుత్వ చర్యలను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తప్పుబడుతున్నారు. ఈ చర్య వల్ల వ్యభిచారం కోసం ఎస్కార్ట్ సర్వీసలను అందిస్తోన్న అన్ని వెబ్‌సైట్లపై నిషేధం విధంచం కష్టమన్నారు. కేవలం కొన్ని వెబ్ సైట్లపై నిషేధం విధించినంత మాత్రాన సమస్యకు పరిష్కారం కాదన్నారు.

Government bans 240 websites offering escort services

కొన్ని వెబ్‌సైట్లు పేర్లు లేదా లింక్‌లో కొద్దిపాటి మార్పు చేస్తే మళ్లీ వస్తాయని వారు ఆరోపించారు. ఇలా కాకుండా ఎస్కార్ట్ వెబ్‌సైట్లను నిర్వహించే నిర్వాహకులను కనిపెట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు. దీంతోపాటు దినపత్రికల్లో ఎస్కార్ట్ సంస్ధల ప్రకటనలు రాకుండా చూడాలన్నారు.

అసలైన సమస్యను పక్కదోవ పట్టించే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉందన్నారు. కేవలం మన దేశానికి చెందిన వెబ్‌సైట్లను మాత్రమే నిషేధించడం సబబు కాదన్నారు. ప్రభుత్వం నిషేధం విధించిన వెబ్‌సైట్లలో ఎక్కువ భాగం ముంబైకు చెందిన వెబ్‌సైట్లు ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+