రిజర్వేషన్లకు కేంద్రం చెక్ ఇలా ? ఉద్యమకారులకు కీలక హామీలు..!
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నడిపిన విద్యార్ధి ఉద్యమం సక్సెస్ తర్వాత దేశంలో మరో ఉద్యమం బయలుదేరింది. అదే రిజర్వేషన్ (reservation) వ్యతిరేక ఉద్యమం. రిజర్వేషన్ హఠావో ఆందోళన్ (RHA) పేరుతో అదే ఢిల్లీ జంతర్ మంతర్ లో ఇది కూడా ప్రారంభమైంది. యూజీసీ యూనివర్సిటీల్లో తెచ్చిన కుల వివక్ష వ్యతిరేక మార్గదర్శకాల నేపథ్యంలో ఇది ప్రారంభమైంది. వర్శిటీల్లో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు సైతం కుల వివక్ష నుంచి రక్షణ కల్పించేలా ఉన్న ఈ కొత్త రూల్స్ పై అగ్ర వర్ణాల వ్యతిరేకతే ఇందుకు నేపథ్యం. దీంతో రిజర్వేషన్ హఠావో ఉద్యమకారులు ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాలకు ఉద్యమం విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ తరుణంలో జోక్యం చేసుకున్న కేంద్రం.. వారికి కొన్నికీలక హామీలు ఇచ్చింది. వీటిని రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమకారుడు హర్ష్ దూబే ఇవాళ బయటపెట్టారు. ఆగస్టు 21న జంతర్ మంతర్ వద్ద భారీ జనసందోహంతో తాము నిర్వహించిన ఉద్యమం ఆ తర్వాత ముగిసిందని, తమకు ఏం కావాలో ప్రభుత్వం అడిగినప్పుడు, డిమాండ్ల పత్రాన్ని కేంద్ర నాయకత్వానికి సమర్పిస్తామని చెప్పినట్లు ఆయన వెల్లడించారపు. తమను ఒక సమావేశానికి ఆహ్వానించారని, అక్కడ రెండు రోజుల పాటు అర్థవంతమైన చర్చలు జరిగాయని తెలిపారు.

నిన్న ఒక త్రైపాక్షిక సమావేశం జరిగిందని, ఆ తర్వాత ఈ విషయంపై సమగ్రంగా చర్చించేందుకు ఇవాళ మరోసారి పిలిచారని హర్ష్ దూబే తెలిపారు. తదుపరి సమావేశం, విలేకరుల సమావేశం త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుని, దేశ ప్రయోజనాల దృష్ట్యా మార్పులు చేపడుతుందని తమకు చెప్పారని, కుల ప్రాతిపదికన ఉన్న విభజనలను తొలగించడం, దేశాన్ని ముందుకు నడిపించడం, రిజర్వేషన్ల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడటం ఈ మార్పుల ఉద్దేశ్యమన్నారు. ఈ దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటారని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై తదుపరి చర్చల కోసం కేంద్రమంత్రి జేపీ నడ్డా త్వరలోనే తమను కలుస్తారని కూడా పేర్కొన్నారు. తమ డిమాండ్ల పత్రాన్ని ఇప్పటికే ఆయనకు సమర్పించామన్నారు.














Click it and Unblock the Notifications