కేంద్రం వరాల సునామీ

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, దాని వల్ల అంతర్జాతీయ సప్లై చైన్ లో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో అనేక కీలక పెట్రోరసాయన ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. పెట్రో కెమికల్స్ ఉత్పత్తులకు దిగుమతి సుంకాలు, ఇతర పన్నుల నుండి మినహాయింపు ఇచ్చింది. కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించిన గెజిట్ జారీ అయింది. ఈ మినహాయింపులన్నీ కూడా తక్షణమే అమలులోకి వస్తాయి.

అమ్మోనియం నైట్రేట్, మెథనాల్, స్టైరీన్, ఎసిటిక్ యాసిడ్, పాలీవైనిల్ క్లోరైడ్ వంటి పెట్రో కెమికల్స్ ఉత్పత్తుల దిగుమతులకు ఈ మినహాయింపులు వర్తిస్తాయి. అంతేకాకుండా అమ్మోనియం నైట్రేట్‌ను వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ నుండి కూడా ప్రభుత్వం మినహాయించింది. ఈ చర్య రైతాంగానికి కొంత ఊరట కలిగించే అవకాశం ఉంది. మినహాయింపు పొందిన ఉత్పత్తుల జాబితాలో అనేక వస్తువులు ఉన్నాయి.

Govt Extends Petrochemical Imports Exemption to Shield Textiles Pharmaceuticals Fertilizers More

ఇందులో అనైడ్రస్ అమ్మోనియా, ఎసిటిక్ యాసిడ్, అమ్మోనియం నైట్రేట్, ఇథైలీన్ పాలిమర్స్ (ఇథైలీన్-వినైల్ ఎసిటేట్‌తో సహా), పాలీప్రొపిలీన్, పాలీస్టైరీన్ వంటివి ప్రధానంగా ఉన్నాయి. అలాగే టోలుయీన్, స్టైరీన్, డైక్లోరోమీథేన్, మెథనాల్ (మిథైల్ ఆల్కహాల్), ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ఫినాల్, ప్యూరిఫైడ్ టెరెఫ్రాథలిక్ యాసిడ్, టోలుయీన్ డైఐసోసైనేట్, లీనియర్ ఆల్కైల్‌బెంజీన్‌లు కూడా ఈ జాబితాలో చేర్చారు.

వీటితో పాటు పాలీటెట్రాఫ్లోరోఎథైలీన్, పాలీవైనిల్ ఎసిటేట్, పాలీవైనిల్ ఆల్కహాల్, పాలీఆక్సీమీథైలీన్, పీక్ రెసిన్స్, ఎపాక్సీ రెసిన్స్, పాలీకార్బొనేట్స్, పాలీయురేథేన్స్ వంటి ఎన్నో ఇతర రసాయన, ప్లాస్టిక్ ఉత్పత్తులు కూడా ఈ మినహాయింపుల పరిధిలోకి వస్తాయి. ఔషధాలు, పెయింట్లు మొదలుకొని గార్మెంట్స్, టెక్స్ టైల్స్, బొమ్మల వరకు అనేక పరిశ్రమలు పెట్రోరసాయనాలను ముడిసరుకులుగా వినియోగిస్తాయి.

ఇరాన్ సంఘర్షణ కారణంగా ముడి చమురు, సహజ వాయువు ధరలు పెరగడంతో ఈ పరిశ్రమలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. పెట్రో కెమికల్స్ గ్లోబల్ సప్లై చైన్ సాధారణ స్థితికి చేరుకునే వరకు ఈ మినహాయింపులు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఇన్పుట్ ఖర్చులు తగ్గకపోవడంతో ఈ పరిశ్రమలు మార్జిన్ ఒత్తిడిని దీర్ఘకాలం ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+