నటిని చూసి హస్త ప్రయోగం, కామాంధుడికి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం !
తిరువనంతపురం/కేరళ: బస్సులో సినీ నటిని చూసి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు జీవితం గడిపిన ఆ కామాంధుడు చివరికి బెయిల్ మీద బయటకు వచ్చాడు. సెంట్రల్ జైల్లో జైల్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తికి ఘన స్వాగతం పలకడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆర్ టీసీ బస్సులో సినీ నటి పక్కన కర్చుని హస్త ప్రయోగం చేసి ఆమెను నానా ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తిని ఇప్పుడు కొందరు నిజ జీవితంలో అతన్ని హీరోను చేశారు.
Savad Sha got Bail and Grand welcome By his Community members !
— Ashwini Shrivastava (@AshwiniSahaya) June 4, 2023
Last month (19th May), He was arrested for masturbating while sitting among women on a bus in Kozhikode, Kerala + pic.twitter.com/GtKR0oFsUo
నటిని చూసి హస్త ప్రయాగం చేసి జైలుకు వెళ్లిన వ్యక్తిని రియల్ హీరోను చేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్‌ఆర్‌టిసి) బస్సులో ప్రయాణిస్తుండగా సినీ నటిని చూసి హస్తప్రయోగం చేశాడని, ఆ వ్యక్తి అతని వ్యక్తిగత భాగాలను, ప్రైవేట్ పార్ట్స్ ను పబ్లిక్ గా అందరి ముందు బహిర్గతం చేశాడని ఆరోపిస్తూ కేరళ పోలీసులు గత నెలలో సవాద్ షా అనే కామంధుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు..

సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సవాద్ షాకు ఘనస్వాగతం లభించింది.:కేరళ రాష్ట్రానికి చెందిన ఆల్ కేరళ మెన్స్ అసోసియేషన్ (ఏకేఎంఏ) నాయకులు సవాద్ షా పూలమాలు వేసి ఘన స్వాగతం పలికినట్లు సమాచారం. కేరళలోని అలువా సబ్ జైలులో కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించిన సవాద్ షా (28) అనే యువకుడు బెయిల్‌పై విడుదల కాగానే అతనికి పూలమాలు వేసి స్వాగతం పలికారని ఏకేఎంఏ అధ్యక్షుడు వట్టియూర్‌కావు అజిత్‌కుమార్ ఓ వీడియో విడుదల చేశారు.
జైలు బయట సవాద్ షాకు పూలమాల వేసి నివాళులర్పించారు. సెంట్రల్ జైలు లోపలని నుంచి సవాద్ షా బయటకు వస్తున్నప్పుడు చప్పట్లు కొట్టి పూలమాలలు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సవాద్ షాకు ఘన స్వాగతం పలికిన విషయం వైరల్ కావడంతో కేరళలోని పలు సంఘాల నాయకులు వీళ్ల ప్రవర్తనపై నిప్పులు చెరుగుతున్నారు. ఇది కమ్యూనిస్టు రాష్ట్రం అయిన కేరళలో మాత్రమే ఇలాంటి పనికిమాలిన పనులు చెయ్యడానికి సాధ్యం అని కొందరు ట్వీట్ కూడా చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే !గత నెలలో త్రిసూర్ నుంచి కేరళలోని కోజీక్కోడ్‌కు కేఎస్ ఆర్ టీసీ (కేరళ ఆర్ టీసీ) బస్సు బయలుదేరింది. ఆ బస్సులో మలయాళం నటి నందితా ప్రయాణిస్తోంది. సవాద్ షా అనే యువకుడు ఆ బస్సులోకి వెళ్లి నటి నందితా పక్కన కూర్చున్నాడు. తొలుత నందితాతో సహజంగానే, మంచి తనంతో సవాద్ షా మాట్లాడాడు. మీరు ఎక్కడికి వెళుతున్నారు..? మీ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందా? అని సవాద్ షా ఆమెను అడిగాడు.
నేను కూడా మీ ప్రాంతానికే వెళ్తున్నాను. తినడానికి మంచి హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని సవాద్ షా నటి నందితాను అడిగాడు. అయితే కేవలం కొన్ని నిమిషాల తర్వాత సవాద్ షా నందితాను వేధించడం ప్రారంభించాడు. ముందుగా నటి నందితా కాలుపై చేయి వేసిన సవాద్ షా ఆమె నడుముపై చేయి వేశాడు. నటి నందితా మొదట పొరపాటున ఇలా జరిగిందని భావించింది.

అయితే సవాద్ షా ప్రవర్తన చూసిన మలయాళం నటి నందితా షాక్ అయ్యింది. ప్యాంటు జిప్ తీసిన సవాద్ షా అతని పురుషాంగాన్ని తాకుతూ హస్త ప్రయోగం చేశాడు. దీంతో షాక్‌కు గురైన నటి నందితా వెంటనే కిటికీ పక్కన కూర్చొని ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని ఫేస్‌బుక్‌లో లైవ్ సవాద్ షా చేస్తున్న పాడుపనిని వీడియో తీసి పోస్ట్ చేసింది. కొంతసేపు చేతికి పన పెట్టిన సవాద్ షా తరువాత నటి నందితా వీడియో తీస్తున్న విషయం గమనించి హడలిపోయాడు.
ఈ విషయాన్ని గమనించినా సవాద్ షా కొద్ది నిమిషాల తరువాత మరోసారి అతని పురుషాంగాన్ని బయటకు తీసినట్లు కూడా తెలిసింది. సవాద్ షా రెచ్చిపోవడంతో నటి నందితా కేకలు వేయడంతో విషయం తెలుసుకున్న కండక్టర్ బస్సులో సవాద్ షాతో గొడవపెట్టుకున్నాడు. తరువాత కండెక్టర్ బస్సు ఆపాలని డ్రైవర్ కు చెప్పాడు. ఆ సందర్బంలో కండెక్టర్. సవాద్ షా మధ్య వాగ్వివాదం జరిగింది.
డ్రైవర్ బస్సు నిలపగానే బస్సులో ఉన్న కండక్టర్‌ని పక్కకు తోసేసిన సవాద్ షా అక్కడి నుంచి తప్పించుకుని రోడ్డు క్రాస్ చేసి పారిపోయాడు. అయితే ఎట్టకేలకు కండక్టర్ సవాద్ షాను వెంబడించి అతన్ని పట్టుకుని తన్ని పోలీసులకు అప్పగించాడు. ఆ తర్వాత జైలుకెళ్లిన సవాద్ షా 28 రోజుల పాటు సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యాడు.
సవాద్ షా ఏదో ఘనకార్యం చేశాడని అతన్ని పూలమాలలతో సత్కరించి అని జేజేలు చెప్పడం ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్ అయ్యింది. జైలు బయట సవాద్ షాకు పూలమాలు వేసి చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతున్న సమయంలో, అతను అక్కడి నుంచి కారులో వెలుతున్న సమయంలో తీసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications