ఇదేమీ విచిత్రం.. పీటల మీద బుల్లెట్ బైక్ డిమాండ్, పెళ్లి నో అన్న వధువు..
తమ డిమాండ్లను తీర్చే వేదిక పెళ్లి మంటపమే అనుకుంటారు కొందరు. అత్తగారింటీపై పెత్తనం చెలాయిస్తారు. చాలా మంది డిమాండ్ చేయకున్న.. కొందరు మాత్రం నానా హంగామా చేస్తుంటారు. బండి కావాలని, చైన్ కావాలని అడుగుతుంటారు. కొందరు అయితే తమ కోరికను ఆ క్షణంలో నెరవేర్చుకుంటారు. దీంతో పెళ్లికూతురు విసుగెత్తిపోతారు. కొందరు పెళ్లి వద్దు బాబొయ్ అంటారు. అలాంటి ఘటనే యూపీలో జరిగింది.

బుల్లెట్ బైక్ కోసం పట్టు..
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో బుల్లెట్ బైకు కోసం పెళ్లి ఆగింది. వధువు తండ్రి బుల్లెట్ బైకు కోసం నగదు సమకూర్చినా పెండ్లి మాత్రం రద్దయ్యింది. బరేలీలోని పర్తాపుర్ చౌధరీ గ్రామానికి చెందిన ఖలీల్ ఖాన్ కూతురు కుల్సుమ్‌కు మరో గ్రామానికి చెందిన జీషన్ ఖాన్‌తో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వారి నిశ్చితార్థం జరిగిన సమయంలో వరకట్నానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు. కానీ, ఖలీల్ ఖాన్ తనకు తోచినంతలో కట్నకానుకలు సిద్ధం చేశారు. పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. వధూవరులు వేదికపైకి చేరుకున్నారు.

రూ.2.30 లక్షలు ఇచ్చినా..
ఒకటి తర్వాత ఒకటి పెళ్లి తంతు కొనసాగుతుంది. ఇంతలో పెళ్లి కొడుకు తనకు బుల్లెట్ బైకు కావాలని తిరకాసు పెట్టాడు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ఇప్పటికిప్పుడు బుల్లెట్ బైకు కొనడం సాధ్యం కాదని పెండ్లి కూతురు తండ్రి బతిమాలాడు. బైకు కొనకపోతే బైకుకు అయ్యే రూ.2.30 లక్షలు ఇవ్వాలని పెళ్లి కొడుకు డిమాండ్ చేశాడు. దాంతో వధువు తండ్రి అప్పటికప్పుడు బంధువుల ద్వారా రూ.2.30 లక్షలు ఏర్పాటు చేశాడు.
Recommended Video

నాకీ పెళ్లి వద్దు..
సమస్య తీరిపోయింది, పెళ్లి తంతు ముగిసిపోతుంది అని అంతా భావిస్తున్న సమయంలో వధువు ఊహించని షాక్ ఇచ్చింది. బుల్లెట్ కోసం పెండ్లి పీటల మీదనే తన తండ్రిని ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తితో తనకు పెండ్లి వద్దే వద్దని తెగేసి చెప్పింది. తండ్రి సహా పెళ్లికి హాజరైన బంధువులు అంతా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తన మనసు మార్చుకోలేదు. దాంతో వివాహం రద్దయ్యింది.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications