భార్యతో కలిసి తొలిరాత్రి గడిపిన నవవరుడు.. తెల్లారేసరికి తోటలో..?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి వేడుక జరిగి 24 గంటలు కూడా గడవకముందే నూతన వధువుతో జీవితాన్ని పెంచుకోవాల్సిన పెళ్లి కొడుకు యూనస్ తోటలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ అకస్మాత్తుగా జరిగిన విషాద ఘటనతో నూత వధువు కుటుంబం, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వధువు కుటుంబంతో పాటు ఆ యువకుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇండీ కూటమి చలో లోక్‌భవన్‌ ర్యాలీ.. మంత్రులు అరెస్ట్!
ఇండీ కూటమి చలో లోక్‌భవన్‌ ర్యాలీ.. మంత్రులు అరెస్ట్!

అసలేం జరిగిందంటే?
మంగళవారం పెళ్లి సంప్రదాయం ప్రకారం మీరట్ జిల్లాలోని పావ్లీ ఖాస్ అనే గ్రామానికి యూనస్ అనే యువకుడి పెళ్లి ఊరేగింపు బయలుదేరి వెళ్లింది. పెళ్లి వేడుక అత్యంత వైభవంగా ముగిసిన అనంతరం.. పెళ్లికూతురితో కలిసి ఇంటికి తిరిగి వచ్చిన యూనస్ కుటుంబం బాణాసంచా కాల్చి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకుంది. రాత్రి వేళ యూనస్ తన భార్యతో కలిసి గదికి వెళ్లాడని.. అంతా సాధారణంగానే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Groom Commits Suicide Day After Wedding in Meerut Found Dead in a Mango Orchard Full Details

బుధవారం ఉదయం యూనస్ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. బద్లీ మసీదు మీదుగా ప్రయాణించి బరంపూర్‌కు చెందిన తేజ్‌వీర్ సింగ్‌కు చెందిన మామిడి తోటకు చేరుకున్నాడు. అక్కడ తాడు సహాయంతో చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం తోట వైపు వెళ్లిన ఓ రైతు మృతదేహం వేలాడుతుండటాన్ని గమనించి పోలీసులకు, గ్రామస్థులకు సమాచారం అందించాడు.

35 ఏళ్లుగా భార్యకు దూరంగా.. అయినా నానా పటేకర్ విడాకులు ఎందుకు తీసుకోలేదంటే?
35 ఏళ్లుగా భార్యకు దూరంగా.. అయినా నానా పటేకర్ విడాకులు ఎందుకు తీసుకోలేదంటే?

సమాచారం అందుకున్న ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించేందుకు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు ఎలాంటి చట్టపరమైన చర్యలకు గానీ, పోస్టుమార్టం పరీక్షలకు గానీ నిరాకరించారు. యూనస్ భౌతికకాయాన్ని సాయంత్రం ఖననం కార్యక్రమాలు పూర్తి చేస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+