పెళ్లిలో కాల్పులు: కుప్పకూలిన వరుడు(వీడియో)
హిసార్: ఉత్తర భారతదేశంలో పెళ్లి వేడుకల్లో తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. ఈ సంబరాలు అనేకమార్లు ఆ వేడుకల్లో విషాదాన్నే మిగుల్చుతున్నాయి. అయినా, వేడుకలు నిర్వహించే వారిలో మార్పు రాకపోవడం విచారకరం.
తాజాగా గురువారం హర్యానాలోని హిసార్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో కాల్పుల కారణంగా ఏకంగా పెళ్లి కొడుకే కుప్పకూలాడు. వివాహ వేడుకలో బంధు మిత్రుల మధ్య నిలుచున్న వరుడు.. ఓ వ్యక్తి చేతిలోని పిస్టల్ నుంచి దూసుకువచ్చిన బుల్లెట్ అతని శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడే కూలబడిపోయాడు.
వెనువెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హిసార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH: Groom injured in celebratory firing during a wedding ceremony in Haryana's Hisar (28.4.16).https://t.co/iOOBggZsaO
— ANI (@ANI_news) April 30, 2016
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వరుడిని గాయపరచిన పిస్టల్ పట్టుకున్న వ్యక్తి కూడా సదరు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాడు.
కాగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన వివాహ వేడుకల్లో కాల్పుల కారణంగా పదుల సంఖ్యలో వ్యక్తులు చనిపోవడం గమనార్హం. అయినా, సంబరాలు పేరిట ఈ దురాచారాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications