Groom Dance: "చోలీ కే పీచే క్యాహై"కి పెళ్లికొడుకు డ్యాన్స్.. పెళ్లిని రద్దు చేసిన వధువు తండ్రి

Groom Dance: మనం నెట్టింట భారతీయ వివాహాలకు సంబంధించిన అనేక వీడియోలను చూస్తూనే ఉంటాం. కొన్ని మనల్ని నవ్విస్తాయి.. మరొకొన్ని హృదయాన్ని హత్తుకుంటాయి. పెళ్లి అంటే అంటే వధూవరుల ప్రవేశం నుంచి నృత్యాల వరకు చాలా హంగామా ఉంటుంది. కానీ ఢిల్లీలో వరుడు "చోలీ కే పీచే క్యాహై" పాటకు డ్యాన్స్ చేయడం వల్ల ఆ పెళ్లి రద్దు అయిపోయింది. నిజమేనండోయ్.. పెళ్లికొడుకు డ్యాన్స్ చేసినందుకే పెళ్లి క్యాన్సల్ అయింది.

అసలేం జరిగిందంటే.. ఢిల్లీలో ఓ పెళ్లికొడుకు పెళ్లి మండపానికి ఊరేగింపుగా వచ్చారు. అదే సమయంలో అతని స్నేహితులు డ్యాన్స్ చేయాల్సిందిగా పెళ్లి కొడుకుపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో వరుడు "చోళీ కే పీచే క్యా హై..." పాటకు ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇదంతా చూసిన వధువు తండ్రికి నచ్చలేదు. ఆగ్రహంతో ఈ పెళ్లిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. వరుడు చేసిన పని అనుచితంగా ఉందని, పెళ్లికొడుకు చర్యలు తమ కుటుంబ విలువలను అవమానించేలా ఉన్నాయని వధువు తండ్రి వివాహ వేదిక నుంచి వెళ్లిపోయాడు.

Groom s Dance to Choli Ke Peeche Leads to Wedding Cancellation

ఆ నిర్ణయంతో వధువు కలత చెంది కన్నీటిపర్యంతమైంది. వరుడు ఇదంతా కేవలం సరదా కోసం చేసిన డ్యాన్స్ అని వధువు తండ్రికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. పెళ్లి రద్దు అయిన తర్వాత కూడా వధువు తండ్రి కోపం తగ్గకపోవడంతో పాటు.. తన కుమార్తెతో వరుడి కుటుంబం ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని తెగేసి చెప్పాడు.

ఈ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. "తన స్నేహితుల కారణంగా వరుడి పరువు పోయింది"అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. "నేను చూసిన అత్యంత ఫన్నీ ప్రకటన ఇది" అంటూ మరొకరు రాసుకొచ్చారు. "మామా గారు సరైన నిర్ణయం తీసుకున్నారు.. లేకుంటే ఆ డ్యాన్స్ ను ప్రతిరోజూ చూడాల్సి వచ్చేది" అని మరొకరు స్పందించారు. "ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు, కానీ ఎలిమినేషన్ రౌండ్ జరుగుతోంది."అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+