Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగం విఫలం: మార్గం తప్పిందన్న ఇస్రో ఛైర్మన్ శివన్

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జీఎస్ఎల్‌వీ)-ఎఫ్10 ప్రయోగం విఫలమైంది. జీఎస్ఎల్వీ-ఎఫ్10 వాహన నౌక ద్వారా జీశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించగా.. క్రయోజనిక్ దశలో రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలోకి వెళ్లింది.

మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురురవారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్10ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ వాహనకౌక కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా, 26 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగిన తర్వాత జీఎస్ఎల్వీ-ఎఫ్10 నింగిలోకి వెళ్లింది.

gslv f10 lift off to space: mission could not be fully accomplished

కాగా, భూ పరిశీలన కోసం జీఎస్ఎల్వీ-ఎఫ్10ని ప్రయోగించారు. నీటివనరులు, పంటలు, అడవులు, హిమానీనదాలు, సరిహద్దుల్లో అంచనా తదితర అంశాల గురించి నిరంతర సమాచారం అందించాల్సి ఉంది. భవిష్యత్‌లో జరగబోయే ప్రకృతి వైపరీత్యాలను ఈ ఉపగ్రహం ద్వారా ముందే పసిగట్టవచ్చు. అయితే, రాకెట్ క్రయోజనిక్ దశలో సమస్య తలెత్తడంతో జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగం విఫలమైంది. కాగా, గత సంవత్సరం మార్చిలోనే ఈ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ కరోనావైరస్ ఉధృతి, సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.

జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగం సక్సెస్ అయ్యుంటే..
రెండు వేల 268 కిలోల బరువున్న జీశాట్-1 ఉపగ్రహానికి ఈవోఎస్ 03 కోడ్ ఇచ్చారు. జీశాట్-1 భూ పరిశీలన ఉపగ్రహం. ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్ కాబట్టే దీనికి ఈవోఎస్- 03 అని పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని... జియో ఇమేజింగ్ శాటిలైట్-1 అని కూడా పిలుస్తారు. దీని ఎత్తు 51.70 మీటర్లు. బరువు రెండు వేల 268 కిలోలు. జీశాట్-1 మిషన్ లైఫ్ టైం పదేళ్లు.

Recommended Video

    ISRO : #GSLVF10 EOS-03 విపత్తులను ముందే పసిగట్టేలా Satellite Launch || Oneindia Telugu

    ఈ శాటిలైట్‌ దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడేది. శత్రు దేశాల కదలికలను ఇట్టే పసిగట్టవచ్చు. అంతరిక్షంలో ఇస్రో కన్ను సాయంతో భారత్‌తో పాటు చైనా, పాక్‌ సరిహద్దులను కూడా పర్యవేక్షించవచ్చు. భూ పరిశీలన ఉపగ్రహం ప్రతి రోజూ నాలుగైదు దేశాల చిత్రాలను పంపేది. వాటి సాయంతో..నీటి వనరులు, పంటలు, తుపానులు, వరదలు, అటవీ విస్తీర్ణంలో మార్పులను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడం సాధ్యయ్యేది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+