Gujarat CM In Quarantine: ఎమ్మెల్యేకు వైరస్ సోకడంతో, వారం రోజులు సీఎంవో క్లోజ్..

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ సెల్ప్ క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా వైరస్ సోకిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవాలా మంగళవారం సీఎంతో సమావేశమయ్యారు. తర్వాత అతనికి వైరస్ సోకినట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో విజయ్ రుపానీతో సన్నిహితంగా ఉండటంతో బుధవారం పరీక్షలు చేయించుకుంటానని సీఎం ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

డిప్యూటీ సీఎం, మంత్రి..

డిప్యూటీ సీఎం, మంత్రి..

మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం విజయ్ రుపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్యసుద్దీన్ షేక్, శైలేస్ ఫార్మర్ తదితరులు ఉన్నారు. వాస్తవానికి సమావేశంలో నేతలంతా సోషల్ డిస్టన్స్ పాటించారు. కానీ ఎమ్మెల్యేకు వైరస్ సోకడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

సీఎం క్వారంటైన్..

సీఎం క్వారంటైన్..

దేశంలో తొలిసారి ఓ ముఖ్యమంత్రి సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వెళ్లానని.. ఆయన స్పష్టంచేశారు. తన ఆరోగ్యం బాగుందని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాన్ని పాలిస్తానని పేర్కొన్నారు. మరో వారం రోజులపాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి సందర్శకులను అనుమతించారు.

Recommended Video

    Fake News Buster : 05 కాణిపాకం గుడి క్వారంటైన్ సెంటరా ? బాంద్రా లో జరిగిన దానికి కారణం ఫేక్ న్యూస్
    జ్వరం..

    జ్వరం..

    జమాల్‌పూర్ ఎమ్మెల్యే ఇమ్రాన్.. గత కొద్దిరోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో కరోనా వైరస్ పరీక్ష కోసం తన రక్త నమూనాలను అందజేశారు. మంగళవారం సీఎం విజయ్ రుపానీని కలుసుకొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా పాల్గొన్నాడు. అతని రిపోర్ట్ రాగా.. అందులో కరోనా వైరస్ సోకినట్టు ఉంది. వెంటనే అతనిని గాంధీనగర్ ఎస్ వీ పీ ఆస్పత్రిలో చికత్స అందిస్తున్నారు. ఇక్కడ కరోనా వైరస్ సోకిన వారికి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఇమ్రాన్.. ఎవరెవరిని ఎక్కడ కలిశాడో అనే అంశంపై స్పష్టత లేకుండా పోయింది. కానీ నిర్ధారించిన వారిని మాత్రం క్వారంటైన్‌లో పెడతామని అదికారులు పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+