నా భార్యతో పడుకుందామంటే భయమేస్తోంది.. విడాకులు ఇవ్వండి ఫ్లీజ్
వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం సహజం. కానీ, ఒక 41 ఏళ్ల భర్త తన విడాకుల పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలు గుజరాత్ హైకోర్టును సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. తన భార్య తనపై క్రూరత్వం ప్రదర్శిస్తోందని, ఆ క్రూరత్వం వెనుక వీధి కుక్కలు ఉన్నాయని ఆయన వాదించారు. ఈ క్రైస్తవ జంట 2006లో అహ్మదాబాద్‌లో వివాహం చేసుకున్నారు. భార్య చర్యల కారణంగా తాను మానసిక క్షోభ, లైంగిక సమస్యలను ఎదుర్కొన్నానని ఆ వ్యక్తి కోర్టుకు విన్నవించుకున్నాడు.
భర్త తన పిటిషన్‌లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి..తన భార్య తరచుగా వీధి కుక్కలను ఇంటికి తీసుకువచ్చేదని, వాటిని ఏకంగా తమ పడకగదిలోకి, మంచంపైకి అనుమతించేదని ఆరోపించారు. అంతేకాకుండా, ఆ కుక్కలతో పాటు తాను కూడా మంచంపై పడుకోవాలని, భర్త తన పక్కన పడుకోకూడదని ఒత్తిడి చేసేదని వాపోయాడు.

ఒకసారి ఆ కుక్కలలో ఒకటి తాను మంచంపై పడుకున్నప్పుడు భార్య దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించగా మొరిగిందని, ఒకసారి తనను కరిచిందని కూడా పిటిషన్‌లో పేర్కొన్నాడు.కుక్కల కోసం వంట చేయడంతో పాటు, ఆ పాత్రలను కూడా తానే కడగాల్సి వచ్చేదని, ఈ కుక్కల గోల కారణంగా చుట్టుపక్కల వారు తమను బహిష్కరించారని, పదేపదే పోలీసుల సమన్లు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన వాదించారు. ఈ విషయాలను స్నేహితులతో చెబితే నమ్మకుండా, ఏప్రిల్ ఫూల్ జోక్ అంటూ కొట్టిపారేశారని ఆ వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై కోర్టు వెలుపలే సామరస్యంగా పరిష్కరించుకోవాలని డివిజన్ బెంచ్ కోరింది. అయితే ఇరు పక్షాల నుంచి స్పష్టత రాలేదు. విడాకులతో పాటు భర్త తనకు రూ. 15 లక్షల భరణం ఇవ్వాలని కోరగా, భార్య మాత్రం తనకు రూ. 2 కోట్లు భరణంగా ఇవ్వాలని కోరింది.
మరోవైపు భర్త ఆరోపణలను భార్య తోసిపుచ్చారు. తాను ఎప్పుడూ వీధి కుక్కలను పెంచుకోలేదని, తన భర్తే వీధి జంతువులను చూసుకునే ట్రస్ట్‌లో పనిచేసేవాడని, అందుకే పెంపుడు జంతువులను ఇంటికి తీసుకువచ్చేవాడని ఆమె కోర్టుకు తెలిపింది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications