ట్విస్ట్‌లపై ట్విస్ట్: నిలిచిపోయిన రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్, కొనసాగుతున్న హైడ్రామా

Posted By:
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా కొనసాగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో అనేక అక్రమాలు చోటుచేసుకొన్నాయనే ఆరోపణలు రావడంతో ఈ ఎన్నికను రద్దుచేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మిషన్‌ను ఆశ్రయించింది. అయితే బిజెపి కూడ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్‌గా ఫిర్యాదు చేసింది. రెండు పార్టీల ఫిర్యాదుతో కౌంటింగ్‌ను నిలిపివేశారు అధికారులు.

చదవండి:ట్విస్ట్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలను రద్దుచేయాలని కాంగ్రెస్ డిమాండ్

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. రెండు పార్టీలు పోటీలు పడి ఫిర్యాదులు చేసుకోవడంతో ఏం చేయాలనే దానిపై ఎన్నికల కమిషన్ చర్చిస్తోంది.

Gujarat Rajya Sabha Election: Counting Delayed As Congress, BJP Head To Election Commission

కొందరు ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చి ఓటు చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ రెండు ఓట్లను చెల్లకుండా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

అయితే కౌంటింగ్ నిర్వహించాలని బిజెపి నేతలు ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో బిజెపి ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌ను కోరారు.

రెండు పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఏం చేయాలనే దానిపై ఎన్నికల కమిషన.్ సమాలోచనలు చేస్తోంది. అగ్రనేతలతో అరుణ్‌జైట్లీ చర్చిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The results of the Rajya Sabha election in Gujarat will be announced in a while as counting has been delayed after the Congress approached the Election Commission against two of its legislators who voted for the BJP. Leaders of the ruling BJP also went to the Election Commission
Please Wait while comments are loading...