నేను వరుణ్, ఒత్తిడితో..: లైవ్‌లో టెక్కీ సూసైడ్‌యత్నం

ఢిల్లీ: లైవ్‌లో ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తన స్నేహితుడితో ఫేస్‌బుక్‌లో చాట్ చేస్తూ ఆత్మహత్యా లేఖను పోస్ట్ చేశాడు. ల్యాప్‌టాప్ కెమెరాకు దానిని చూపించి మరీ తన చేతి నరాన్ని తెంచుకున్నాడు. దీంతో ఆ స్నేహితుడు పోలీసులకు విషయం చెప్పాడు.

వెంటనే స్పందించిన పోలీసులు అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అతని పేరు వరుణ్ మాలిక్. అతను తన తండ్రితో కలిసి ఉంటున్నాడు. నాలుగేళ్లుగా సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.

గత కొద్ది రోజులుగా అతను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు.య జీవితం పైన విరక్తి భావం అతనిలో కనిపించిందని స్నేహితులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన అతను మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో స్నేహితుడితో చాట్ చేస్తు ఆత్మహత్యాయత్నం చేశాడు.

Gurgaon Techie Posts Photos Of Suicide Attempt On Facebook, Saved

ఆ సూసైడ్ నోట్లో... 'నేను వరుణ్ మాలిక్. మానసిక ఒత్తిడి కారణంగా నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. నాకు ఎవరూ లేరు. నేను ఒంటరిని. నాకు ఆత్మహత్య మినహా మరో అవకాశం లేదు' అని నోట్లో పేర్కొన్నాడు.

ఆ వెంటనే స్పందించిన వరుణ్ మాలిక్ స్నేహితుడు.. వరుణ్ ఎక్కడ ఉంటాడో గుర్గావ్ వారికి తెలుసునని, పోలీసులు వెంటనే వెళ్లి అతనిని రక్షించాలని సూచించాడు. అదే సమయంలో, వరుణ్ స్నేహితులు ఈ కామెంట్ చూస్తే తనకు వరుణ్ ఇంటి అడ్రస్ చెప్పాలని విజ్ఞప్తి చేసారు. ఎట్టకేలకు పోలీసులు అడ్రస్ గుర్తించి అతనిని రక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+