ఫేస్ బుక్ హ్యాక్: బ్లూ ఫిలింలు పెడుతానంటూ బ్లాక్ మెయిల్

చండీగడ్: ఫేస్ బుక్ ఖతాలు హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ బలవంతంగా డబ్బు వసూలు చేస్తు జల్సాలు చేస్తున్న యువకుడిని హర్యానా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఇతను పలువురు అమాయకుల ఫేస్ బుక్ ఖాతాలు హ్యాక్ చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.

చండీగడ్ లోని యమునా నగర్‌లో నివాసం ఉంటున్న అరవింద్ సింఘాల్ (24) అనే యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇతను పలు ప్రాంతాలలోని ఇంటర్ నెట్ సెంటర్ల నుండి ఆరు నెలల వ్యవధిలో పలువురి 20 ఫేస్ బుక్ ఖతాలు హ్యాక్ చేశాడు.

తరువాత వారిని సంప్రదించి తాను అడిగిన సొమ్ము ఇవ్వలేదంటే మీ ఫేస్ బుక్ అకౌంట్ లో పోర్న్ వీడియోలు అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. ఈ విధంగా వారిని పలు సార్లు బెదిరించి అతని అకౌంట్ లో నగదు డిపాజిట్ చేయించుకున్నాడు.

 hacked over 20 Facebook accounts in chandigarh

నహన్ ప్రాంతానికి చెందిన సర్వేశ్ శర్మ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ నుండి అసభ్య చిత్రాలు వస్తున్న విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అరవింద్ సింఘాల్ ను అరెస్టు చేశారు.

ఇతని నుండి వివిధ కంపెనీలకు చెందిన 17 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. ఈ సిమ్ కార్డులను అరవింద్ సింఘాల్ ఫేస్ బుక్ అకౌంట్ లు హాక్ చెయ్యడానికి పాస్ వర్డ్స్ గా ఉపయోగించేవాడని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+