Hair fall: పెళ్లి కాలేదని బట్టతల యువకుడి ఆవేదన, డాక్టర్ ఇచ్చిన మందులతో ?, డెత్ నోట్ లో, షాక్!

తిరువనంతపురం/కేరళ: బట్టతల కారణంగా ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మగాళ్లు బాధపడుతున్న విషయం తెలిసిందే. తల మీద వెంట్రుకలు ఉండాలని ట్రీట్ మెంట్లు తీసుకోవడం, హెయిర్ ప్లాంట్ చేసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. పెళ్లి కావలసిన యువకుడికి తల మీద వెంట్రుకలు ఊడిపోతుంటే ఓ వైద్యుడిని కలిశాడు.

కొన్ని సంవత్సరాల నుంచి ఆ డాక్టర్ దగ్గర ఆ యువకుడు చికిత్స చేసుకుంటున్నాడు. డాక్టర్ చెప్పిన మందులువాడాడు. డాక్టర్ దెబ్బకు బట్ట తల యువకుడికి సినిమా కనపడింది. నా చావుకు డాక్టర్ కారణం అంటూ బట్టతల యువకుడు డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

బట్టతలతో నానా తంటాలు

బట్టతలతో నానా తంటాలు

హెయిర్ ఫాల్ కాకుండా చికిత్స అందిస్తామని కోట్ల రూపాయలు ఖర్చు చేసి టీవీలల్లో ప్రకటనలు ఇస్తున్నారు. బట్టతల కారణంగా ప్రపంచంలో కొన్ని వేల కోట్ల మంది మగాళ్లు బాధపడుతున్న విషయం తెలిసిందే. తల మీద వెంట్రుకలు ఉండాలని ట్రీట్ మెంట్లు తీసుకోవడం, హెయిర్ ప్లాంట్ చేసుకోవడం మనం నిత్యం చూస్తున్నాము.

పెళ్లి కావలసిన యువకుడు

పెళ్లి కావలసిన యువకుడు

కేరళలోని కోజీకోడ్ జిల్లాలోని నార్త్ కన్నూర్ ప్రాంతంలో ప్రశాంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 2012 నుంచి ప్రశాంత్ కు తల మీద వెంట్రుకలు ఊడిపోవడం మొదలైయ్యింది. పెళ్లి కావలసిన ప్రశాంత్ తల మీద వెంట్రుకలు ఊడిపోతుంటే కోజీకోడ్ లో ఓ వైద్యుడిని కలిశాడు. 2014 నుంచి ఆ డాక్టర్ దగ్గర ఆ యువకుడు చికిత్స చేసుకుంటున్నాడు.

డాక్టర్ ఏం చెప్పాడంటే?

డాక్టర్ ఏం చెప్పాడంటే?

కోజీకోడ్ డాక్టర్ చెప్పిన మందులను ఆ రోజు నుంచి ప్రశాత్ వాడుతున్నాడు. నీకు తల మీద వెంట్రుకలతో పాటు శరీరంలోని వెంట్రుకలు మొత్తం రాలిపోతాయని, తరువాత కొత్త వెంట్రుకలు వస్తాయని, తరువాత నీ శరీరంలో హెయిర్ ఫాల్ అనేది ఉండదని ఆ డాక్టర్ ప్రశాంత్ కు చెప్పాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.

మ్యాటర్ మొత్తం రాసి ఆత్మహత్య

మ్యాటర్ మొత్తం రాసి ఆత్మహత్య

డాక్టర్ చెప్పిన మందులు వాడిన ప్రశాంత్ కు తల మీద, కను బొమ్మలతో పాటు శరీరంలోని వెంట్రుకలు మొత్తం ఊడిపోయాయి. కొత్తగా వెంట్రుకలు రాకపోవడంతో బయట తిరగలేక ప్రశాంత్ చాలాకాలం నుంచి ఇంటికే పరిమితం అయ్యాడు. తనకు జీవితంలో తల మీద వెంట్రుకలు రావని ఆవేదన చెందిన ప్రశాంత్ డెత్ నోట్ లో మ్యాటర్ మొత్తం రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

నా ఆత్మహత్యకు పనికిమాలిన డాక్టర్ కారణం

నా ఆత్మహత్యకు పనికిమాలిన డాక్టర్ కారణం

నా తల మీద, శరీరంలో వెంట్రుకలు మొత్తం రాలిపోవడానికి ఆ డాక్టర్ ఇచ్చిన చికిత్స, మందులే కారణం అని ప్రశాంత్ అతని డెత్ నోట్ లో రాశాడు. నా చావుకు డాక్టర్ కారణం అంటూ బట్టతల యువకుడు ప్రశాంత్ డెత్ నోట్ రాసి స్నేహితులకు మెసేజ్ చేసి అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

వెంట్రుకలతో పాటు ప్రాణం పోయింది

వెంట్రుకలతో పాటు ప్రాణం పోయింది

పోలీసులకు ఫిర్యాదు చేసినా డాక్టర్ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశాంత్ కుటుంబ సభ్యులు కోజీకోడ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బట్టతల కారణంగా ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవడం కేరళలో హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రశాంత్ కు తల మీద ఇంతో అంతో వెంట్రుకలు ఉండేవని, డాక్టర్ ఇచ్చిన ట్రీట్ మెంట్ తో అతని వెంట్రుకలతో పాటు ప్రాణం కూడా పోయిందని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+