యుద్ధ విమానాల వివరాలు పాక్ ఐఎస్ఐకి చేరవేత: హెచ్ఏఎల్ ఉద్యోగి అరెస్ట్
ముంబై: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు చెందిన ఓ ఉద్యోగిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. యుద్ధ విమానాలు, తయారీ యూనిట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన నిఘా విభాగం ఐఎస్ఐకి చేరవేసినందుకు అతడిని అరెస్ట్ చేసినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు.
ఐఎస్ఐతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడన్న పక్కా సమాచారంతో ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) నాసిక్ విభాగం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దేశీయ యుద్ధ విమానాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సదరు ఉద్యోగి పాక్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు అధికారులు తేల్చారు.

నాసిక్ సమీపంలో ఓజార్ ప్రాంతంలో ఉన్న హెచ్ఏఎల్ తయారీ కర్మాగారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందజేసినట్లు గుర్తించారు. అధికార రహస్యాల చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, రెండు మెమోరీ కార్డులు సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపర్చగా 10 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.
కాగా, నాసిక్‌కు సమీపంలో 1964లో ఏర్పాటైన తయారీ కర్మాగారంలో మిగ్-21ఎఫ్ఎల్, మిగ్-21ఎం, మిగ్-21బీఐఎస్, మిగ్-27ఎం వంటి యుద్ధ విమానాలతోపాటు, కె-13 మిసైల్ కూడా ఇక్కడే తయారవుతున్నాయి. భారత రక్షణ రంగంలో ఎంతో కీలకంగా ఉన్న ఈ సంస్థకు సంబంధించిన సమాచారం నిందితుడు చేరవేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications