ప్రెండ్‌షిప్, రిలేషన్ షిప్: చేతన్ 'హాఫ్ గర్ల్‌ఫ్రెండ్' హాట్‌గా..!

న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత చేతన్ భగత్ కొత్త నవల హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ అక్టోబరులో రిలీజ్ కానుది. తన ప్రేమకథ నవల అయిన హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ విడుదల కానుందని, ఆ టీజర్ యూట్యూబ్‌లో చూడవచ్చునని భగత్ ట్వీట్ చేశారు. అయితే, ఈ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది.

తన పుస్తకం గురించి పాఠకులకు ఓ ఫీలర్ ఇవ్వడానికి చేతన్ ఈ పుస్తకం మొదటి అధ్యాయాన్ని తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. అయితే వెబ్‌సైట్‌కు విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయి కొన్ని గంటల్లోనే క్రాష్ అయ్యింది. వెబ్‌సైట్ క్రాష్ అవడంతో మొదటి అధ్యాయం లింక్‌ను ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీనికి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది.

'Half girlfriend': Chetan Bhagat's next book due for release in October

ఈ పుస్తకంలో నేటి ప్రపంచంలోని కొత్త మరియు భిన్నమైన సంబంధాల అంశం కూడా ఉందట. బీహార్ నుంచి వచ్చిన మాధవ్ అనే మధ్యతరగతి యువకుడు... ఢిల్లీలోని ధనవంతురాలైన రియాను ప్రేమిస్తాడు. సదరు యువకుడు పెద్ద పెద్ద కలలు కంటుంటాడు.

ఈ పట్టణ - గ్రామీణ ప్రేమకథ... పాఠకుల గుండెను తడమడమే కాకుండా, వారిలో సరికొత్త స్పూర్తిని కూడా నింపుతుందని చేతన్ భగత్ పేర్కొన్నాడు. మాధవ్‌కు ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం రాదు. రియాకు వస్తుంది. మాధవ్ రిలేషన్ షిప్ కోరుకుంటాడు. రియా కోరుకోదు. రియా మాత్రం ఫ్రెండ్‌షిప్ అనుకుంటోంది. అందుకు మాధవ్ అసలు అంగీకరించడు. దీంతో రియా ఓ ప్రతిపాదన తెస్తుంది. అదే హాఫ్ గర్ల్‌ఫ్రెండ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+