Ayodhya verdict: మేము కోరుకున్నది అదే: ఇక ఏ మసీదునూ ఎవరూ టచ్ చేయరనే : ముస్లిం కక్షిదారుడు, న్యాయవాది

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై శనివారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముస్లిం కక్షిదారుడు ఇక్బాల్ అన్సారీ, ముస్లిం పార్టీల తరఫు న్యాయవాది ఇజాజ్ మక్బూల్ మిశ్రమ స్పందనను వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని అన్నారు. తాము కోరుకున్నట్లు గానే తీర్పు వెలువడిందని ఇక్బాల్ అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ తీర్పు తరువాత దేశంలో మరే ఇతర మసీదును ఎవ్వరూ టచ్ చేయరని తాము ఆశిస్తున్నామని ఇజాజ్ మక్బూల్ అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. అయోధ్య భూవివాదానికి సంబంధించిన కేసు హిందువులకు అనుకూలంగా వస్తుందని తాము అంచనా వేశామని, తమ అంచనా తప్ప లేదని అన్నారు. తాము కోరుకున్నట్లుగానే కేసు తీర్పు వెలువడిందని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి స్థలం హిందువులకు దక్కడం తనకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. తీర్పు హిందువులకు సానుకూలంగా రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సున్నీ వక్ఫ్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా ఉందని ఇక్బాల్ అన్సారీ చెప్పారు.

Happy that SC has finally delivered a verdict, I respect it, says Iqbal Ansari, one of the litigants in Ayodhya case

ప్రత్యామ్నాయంగా సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన అయిదు ఎకరాల స్థలంలో మసీదును నిర్మించడానికి అవకాశం ఉందని, దాన్ని నిర్మించాల్సి ఉందని అన్నారు. ఈ దిశగా వక్ఫ్ బోర్డు వెంటనే నిర్మాణ పనులను చేపట్టడమే మేలని అన్నారు. ఇదే అంశంపై ముస్లిం న్యాయవాది ఇజాజ్ మక్బూల్ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు తమను నిరాశ పరిచిందని, సరైన సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి అందజేశామని అన్నారు. ఈ తీర్పు తరువాత దేశంలో మరెక్కడా గానీ మసీదులపై దాడులు చేయడం గానీ, దాన్ని టచ్ చేయడానికి గానీ జరగక పోవచ్చని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

సున్నీ వక్ఫ్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై తాము ఎదురు చూస్తున్నామని ఇజాజ్ మక్బూల్ తెలిపారు. సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున అయోధ్య తీర్పుపై వాదనలను వినిపించిన జఫర్యాబ్ జిలానీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది ప్రకటించాల్సి ఉందని అన్నారు. ఆ తరువాతే ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా కేటాయించదలిచిన అయిదు ఎకరాల స్థలానికి చారిత్రక నేపథ్యం ఉండదని, అందువల్లే దానికి విలువ ఉండదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+