Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యువతి మీద రేప్: ఎంత సేపు ఎలా చేశారు, నువ్వు ఏం చేశావు, ఏసీపీ ప్రశ్నలు, చివరికి !

బెంగళూరులో యువతి మీద అత్యాచారంరేప్ ఎలా చేశారు, ఎంత సేపు చేశారు, నువ్వు ఏం చేశావు ?రేప్ ఎక్కడ చేశారో చూపించు, యువతికి ఏసీపీ ప్రశ్నలు, బూతులు, చివరికి !

బెంగళూరు: అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చెయ్యకుండా ఆమెను మరింత వేధింపులకు గురి చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. అత్యాచారం ఎలా చేశారు, ఎంత సేపు చేశారు, నువ్వు ఏం చేశావు, ఎక్కడ చేశారు చూపించూ అంటూ ఓ పోలీసు అధికారి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో విచారణ మొదలైయ్యింది.

ఇటీవల ఓ యువతి తన మీద అత్యాచారం జరిగిందని సోలదేవనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి తనకు న్యాయం చెయ్యాలని బాధిత యువతి పోలీసులకు మనవి చేసింది. అయితే కేసు నమోదు చేసి విచారణ చెయ్యడానికి సోలదేవనహళ్ళి పోలీస్ ఇన్స్ పెక్టర్ నిరాకరించారు.

Harresment on women from ACP in police station in Bangaluru

బాధితురాలు యశవంతపురం ఏసీపీ కార్యాలయానికి వెళ్లి సోలదేవనహళ్ళి పోలీసులు కేసు నమోదు చెయ్యడానికి నిరాకరించారని ఫిర్యాదు చేసింది. ఆ సందర్బంలో యశవంతపురం ఏసీపీ రవిప్రసాద్ బాధిత యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.

రేప్ ఎలా చేశారు ?, ఎంత సేపు చేశారు ?, అప్పుడు నువ్వు ఏం చేశావు ?, ఎలా చేశారు చూపించు ? అంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా ఏసీపీ రవిప్రసాద్ బయటకు చెప్పలేని రీతిలో బూతులు మాట్లాడాడని, మీరైన న్యాయం చెయ్యాలని బాధిత యువతి బెంగళూరు నగర పోలీసు కమిషన్ టీ. సునీల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రవిప్రసాద్, సోలదేవనహళ్ళి ఇన్స్ పెక్టర్ వ్యవహారంపై విచారణ చేసి నివేధిక ఇవ్వాలని బెంగళలూరు ఉత్తర విభాగం డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ కు సిటీ పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+