• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'హనీప్రీత్ ఓ మంచి కోడలు కానీ, రాసలీల తర్వాతే ఇలా, కూతుళ్లు గర్భం దాల్చొద్దనే నపుంసకులుగా'

|
  డేరాబాబా బెడ్ రూంలో నగ్నంగా తిరుగుతూ వీడియో తీయించిన హనీప్రీత్? | Oneindia Telugu

  సిర్సా: డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ కోసం హర్యానా పోలీసులు బికనీర్‌లో ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ ఆచూకీ దొరకడం లేదు.

  డేరాబాబా రూంలో నగ్నంగా తిరుగుతూ వీడియో తీయించిన హనీప్రీత్?

  పంచకుల సెక్టార్ 3 పోలీసులు పిలిబంగా, లుంకర్న్‌సార్, శ్రీకోలాయత్, జంశార్, జగ్డేవాలా, గురుసార్ మోడియా అనే ఆరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. కానీ ఆమె దొరకలేదు.

  హనీప్రీత్-డేరా బాబా మధ్య ఆ సంబంధమా, 18 ఏళ్లవుతోంది: బంధువు షాక్

  హనీప్రీత్ ఓ మంచి కోడలు

  హనీప్రీత్ ఓ మంచి కోడలు

  హనీప్రీత్ మాజీ భర్త పేరు విశ్వాస్. విశ్వాస్ తండ్రి మహేష్ తన మాజీ కోడలు హనీప్రీత్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హనీప్రీత్ చాలామంచి కోడలు అని, కానీ డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆమె దారి తప్పేలా చేశారని వాపోయారు. హనీప్రీత్ పాతపేరు ప్రియాంక తనేజా.

  విడాకుల కోసం కోర్టుకు

  విడాకుల కోసం కోర్టుకు

  హనీప్రీత్ మామ అయిన మహేష్ 1970ల నుంచి డేరా సచ్చా సౌదా పాలోవర్. 1999లో ప్రియాంక, విశ్వాస్‌లకు పెళ్లయింది. 2009లో వీరు విడిపోయారు. డేరా బాబా, హనీప్రీత్‌ల మధ్య సంబంధం నేపథ్యంలో విశ్వాస్ విడాకుల కోసం 2011లో కోర్టుకు వెళ్లారు.

  హనీప్రీత్ అత్తింట మర్యాదపూర్వకంగా

  హనీప్రీత్ అత్తింట మర్యాదపూర్వకంగా

  హనీప్రీత్ చాలామంచి కోడలు అని విశ్వాస్ తండ్రి చెప్పారు. అప్పుడు ఆమె తమ కుటుంబంలో ప్రతి ఒక్కరి పట్ల గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా ఉండేదని చెప్పారు. 2009 డిసెంబర్ 30వ తేదీన గుర్మీత్ ఆమెను దత్తత తీసుకున్నారని, అప్పటి నుంచి ఆమె అక్కడే ఉండిపోయారని చెప్పారు.

  అప్పుడు డేరాకు ఒంటరిగా వెళ్లని హనీప్రీత్

  అప్పుడు డేరాకు ఒంటరిగా వెళ్లని హనీప్రీత్

  అంతకుముందు పెళ్లైన తర్వాత తమ కుటుంబం డేరాకు వెళ్లేదని, తమతో పాటు హనీప్రీత్ కూడా వచ్చేదని విశ్వాస్ తండ్రి మహేష్ చెప్పారు. కానీ అప్పుడు హనీప్రీత్ ఎప్పుడు కూడా ఒంటరిగా డేరాకు వెళ్లలేదని చెప్పారు. అయితే డేరా బాబా, హనీప్రీత్ రాసలీలల్లో పట్టుబడటంతో తన కొడుకు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడని చెప్పారు.

  అక్రమ సంబంధం గురించి తెలిసి

  అక్రమ సంబంధం గురించి తెలిసి

  తమ మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసిన తన కొడుకును చంపేయాలని డేరా బాబా కుట్ర చేశారని మహేష్ తెలిపారు. తద్వారా హనీప్రీత్‌తో తన సంబంధాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశాడన్నారు. తన కొడుకుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచేలా చేశారని, అలాగే రూ.10 లక్షలు ఇచ్చి తన కొడుకును చంపించే ప్రయత్నాలు చేశారని, దీంతో తాను తన కొడుకుకు భద్రత కల్పించాలని కోరగా వేరే సెల్‌కు మార్చారని, తమను చంపేసే ప్రయత్నాలు చేయడంతో 2014లో తమ ఆరోపణలపై వెనక్కి తగ్గామని ఆవేదనగా చెప్పారు.

  డేరాబాబా రాసలీలలు ఎవరికీ తెలియదు

  డేరాబాబా రాసలీలలు ఎవరికీ తెలియదు

  డేరా బాబా చేసే రాసలీలలు ఆయన అనుచరులకు, భక్తులకు ఎవరికీ తెలియదని మహేష్ చెప్పారు. చాలామంది సత్సంగ్ వినేందుకు మాత్రమే డేరాకు వెళ్తారని చెప్పారు. కాబట్టి లోపల ఏం జరుగుతుందో అందరికీ తెలియదని చెప్పారు.

  డేరా బాబాపై అత్యాచారం కేసు అంటే నమ్మలేదు

  డేరా బాబాపై అత్యాచారం కేసు అంటే నమ్మలేదు

  డేరా బాబాపై అత్యాచారం కేసు అంటే ఆయన భక్తులు ఎవరూ నమ్మలేదని మహేష్ చెప్పారు. అది కుట్రలో భాగమని, ఫేక్ అని భావించారని చెప్పారు. అంతేకాదు తనపై అత్యాచారం కేసు లిక్కర్ మాఫియా కుట్ర అని డేరా బాబా చెప్పారని తెలిపారు. దీనిని అందరూ నమ్మారని చెప్పారు.

  నపుంసకులుగా ఎందుకు చేశాడంటే..

  నపుంసకులుగా ఎందుకు చేశాడంటే..

  పలువురు మగవారిని డేరా బాబు నపుంసకులుగా చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై మహేష్ ఆసక్తికర విషయం వెల్లడించారు. డేరా బాబాకు ఇద్దరు పెళ్లైన కూతుళ్లు, ఒక పెళ్లైన కొడుకు ఉన్నాడని చెప్పారు. వారు డేరాలోనే ఉంటారని తెలిపారు. అందరికీ సాద్వీ (సేవకురాలు)లను పెట్టారని, అలాగే డేరాలో సాధువు (పురుషులు) కూడా ఉండేవారని చెప్పారు. అందరికీ రోజుకు ఎనిమిది గంటల పని ఉంటుందన్నారు.

  కూతుళ్లను గర్భవతులుగా చేస్తారనే భయంతోనే నపుంసకులుగా..

  కూతుళ్లను గర్భవతులుగా చేస్తారనే భయంతోనే నపుంసకులుగా..

  తన కూతుళ్ల పట్ల మగవారు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తారని, వారిని గర్భవతులు చేసినా చేస్తారని డేరా బాబా అనుమానించేవాడని మహేష్ చెప్పారు. అలా జరగకుండా ఉండేందుకు వారిని నపుంసకులుగా చేశారని చెప్పారు. పైగా ఆ సాధువులకు డబ్బులు ఇచ్చేవారు కాదని, కేవలం ఆహారం, దుస్తులు మాత్రమే ఇచ్చేవారని చెప్పారు. ఈ విషయాన్ని బాబా తనకు చెప్పారని తెలిపారు. తమకు ఇలా జరుగుతుందని సాధువులకు ముందే తెలిసినా చంపేస్తారనే భయంతో వారు ఏం చేయలేకపోయే వారని తెలిపారు.

  ఓటు బ్యాంక్ ఉందని రాజకీయ నాయకులతో

  ఓటు బ్యాంక్ ఉందని రాజకీయ నాయకులతో

  తనకు ఉన్న అనుచరులు, భక్తుల కారణంగా దానిని ఓటు బ్యాంకుగా చేస్తానని చెప్పి పలువురు రాజకీయ నాయకులను డేరా బాబా తనకు అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. పలువురు రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం డేరా బాబాను సందర్శించేవారని చెప్పారు. తనకు ఉన్న రాజకీయ పలుకుబడితే అనేక అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పారు.

  డబ్బులు ఎలా వచ్చేవంటే?

  డబ్బులు ఎలా వచ్చేవంటే?

  డేరా బాబు అనుచరులు లేదా భక్తులు తాము సంపాదించిన దాంట్లో 15 శాతం డేరాకు ఇచ్చే వారని చెప్పారు. డేరా లోపల 10 కమర్షియల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలిపారు. అలాగే డేరాలో థియేటర్లు ఉన్నాయని చెప్పారు. అక్కడ టిక్కెట్లు చాలా ఖరీదు అని చెప్పారు. డేరా బాబా పక్కన కూర్చుంటే లక్షల్లో ఉంటుందన్నారు.

  10 కూడా పాస్ కానీ జమీందార్ ఫ్యామిలీ వ్యక్తి డేరా బాబా

  10 కూడా పాస్ కానీ జమీందార్ ఫ్యామిలీ వ్యక్తి డేరా బాబా

  డేరా బాబా కనీసం పదో తరగతి కూడా పాస్ కాలేదని తెలుస్తోంది. అతను జమీందార్ కుటుంబం నుంచి వచ్చిన వాడు. డేరా బాబా ప్రస్తుతం అత్యాచారం కేసులో జైలులో ఉన్న విషయం తెలిసిందే.

  English summary
  The Haryana police has unsuccessfully raided six locations in Bikaner searching for Honeypreet Insan, the adopted daughter of Dera Sacha Sauda Chief Gurmeet Ram Rahim Singh, for the last two days.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X