సీట్ బెల్ట్ పెట్టుకోలేదని బైకిస్టుకు చలాన్ విధించారు!
ఛండీఘర్: సీటు బెల్ట్ పెట్టుకోలేదని ద్విచక్ర వాహనదారుడికి చలాన్ విధించారు పోలీసులు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోనిపట్‌కి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వెళుతుండగా చెక్‌పోస్ట్ వద్ద చెకింగ్ కోసం ఆపి సీట్ బెల్ట్ లేదని చలాన్ విధించారు.
అంతేగాక, తాము చేసిన తెలివితక్కువ పని బయటపడకుండా రసీదు మీద బైక్ అని కాకుండా కారుగా నమోదు చేశారు. కారు నెంబరు స్థానంలో బైక్ నెంబరు రాశారు. కాగా, ఇలాంటి ఘటనలు హర్యానాలో ఇప్పటివరకు చాలానే జరిగాయి.

ఇటీవల గోహ్నా ప్రాంతంలో చెక్‌పాయింట్ వద్ద బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఆపి లైసెన్స్ లేదని చలాన్ విధించారు.
జరిమానా కట్టాక సీట్ బెల్ట్ లేదంటూ మరో చలాన్ విధించారు. దీంతో ఆ యువకులు పోలీస్ స్టేషన్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ పోలీసులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని యువకులకు ఉన్నతాధికారులు హామి ఇవ్వడం జరిగింది.












Click it and Unblock the Notifications