సెక్స్ స్కాండల్ కేసులో ట్విస్ట్, మాజీ ఎంపీకి జైల్, మాజీ ఎమ్మెల్యేకి బెయిల్
హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసుకు సంబంధించి అసభ్యకర వీడియో లీక్ చేశారని నమోదు అయిన కేసులో చిక్కుల్లో పడిన హాసన్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ప్రీతమ్ గౌడను అరెస్ట్ చేయకూడదని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా విచారణ కొనసాగించాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని పిటిషనర్ ప్రీతమ్ గౌడను హైకోర్టు ఆదేశించింది.
ప్రీతమ్ గౌడకు అనుకూలంగా ఆయన న్యాయవాదులు వాదించడంపై పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవివర్మ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధితురాలి వీడియోను షేర్ చేయడంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కావున మమధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇవ్వరాదని కోరుతున్నామని అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసుకు సంబంధించి సుమారు మూడు లక్షల పెన్ డ్రైవ్‌లు పంపిణీ చేశారని ప్రజలు మాట్లాడుకుంటున్నారని కోర్టుకు చెప్పారు.

అందుకే ప్రీతమ్ గౌడను విచారణ చెయ్యాలని, ఆయనకు బెయిల్ ఇవ్వరాదని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు మనవి చేశారు. ప్రీతమ్ గౌడ్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ నగేష్ వాదించారు. వీడియో షేర్ చేయడం వల్ల మహిళల గౌరవం దెబ్బతింటుంది. వీడియో షేరింగ్ చెయ్యడం కూడా తీవ్రమైన నేరం అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కేసు విచారణ చేస్తున్న అధికారులకు సహకరించాలని, కేసు విచారణకు హాజరుకావాలని కోర్టు ప్రీతమ్ గౌడకు సూచించింది.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పెను సంచలనం సృష్టించిన హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌ను షేర్ చేసిన కేసు సంచలన మలుపు తిరిగింది. ప్రజ్వల్ రాజకీయ ప్రత్యర్థి ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ లీక్ కావడం జరిగింది. ఈ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రీథమ్ గౌడ పాత్ర ఉందన్న ఫిర్యాదు నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లో ఆయన దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications