హ్యాట్సాఫ్: పులితో పోరాడి బిడ్డ ప్రాణాలు కాపాడిన తల్లి...
తల్లి నవమోసాలు మోసి బిడ్డను కంటుంది. కడుపులో ఉన్నప్పుడు బిడ్డను ఎంత భద్రంగా చూసుకుంటుందో బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లలనే అంతే భద్రంగా కాపాడుకుంటుంది. పిల్లలకు ఎటువంటి ప్రమాదం సంబంవించినా, ఏ చిన్న సమస్య వచ్చినా తల్లి ఒక వీరనారీలా పోరాడి బిడ్డలను కాపాడుకుంటుంది. ఇలాంటి సంఘటనే ఇప్పడు మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కన్నబిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి ఏకంగా పులితోనే పోరాడింది. చివరికి ఆ పులి బారి నుంచి బిడ్డను కాపాడుకుని అందరిచేత శెభాష్ అనిపించుకుంటుంది.
బిడ్డలకు ఏదైనా ఆపద వస్తే ఏ తల్లయినా సరే తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ వారిని రక్షించుకుంటుంది. అలాంటిదే ఈ కన్నతల్లి చేసింది. సిద్ధిజిల్లాలో ఝరియా అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం దట్టమైన అడవుల మధ్య ఉంటుంది. అందుకే ఈ ప్రదేశంలో నిత్యం జంతువులు సంచరిస్తూ ఉంటాయి. అయితే, అదే గ్రామానికి చెందిన కిరణ్ బైగాకు ముగ్గురు సంతానం. అయితే, కిరణ్ ఒకరోజు పిల్లలతో కలిసి ఇంటిముందు చలిమంట కాచుకుంటుంది. ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో తెలియదు కానీ, ఓ చిరుతపులి వారిపై దాడిచేసి అక్కడే ఉన్న పిల్లవాణ్ని ఎత్తుకెళ్లిపోయింది.

కొడుకును కాపాడుకునేందుకు పులితో పోరాడిన తల్లి...
ఆ సంఘటనతో కిరణ్‌కు నోటమాట రాలేదు. తన బిడ్డకు ఎమౌవుతుందోనన్న భయం ఆమెను అణువణువునా వెంటాడింది. దాంతో చిరుతపులి వెళ్లిన మార్గంలోనే వెళ్లింది. ఆ చిరుతపులిని వెంబడించి తన కొడుకు ప్రాణాలను ఎలాగైన కాపాడుకోవాలనుకుంది. అందుకు పులితోనైనా పోరాడేందుకు సిద్ధపడింది. అలా పులి వెనుక కేకలు వేస్తూ పరుగెత్తింది. పులి నోట్లో ఉన్న బిడ్డను చూసిన ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ధైర్యం తెచ్చుకుని పులివెంటే కిలోమీటర్ మేర తన ప్రయాణాన్ని సాగించింది.
అయితే, ఈ క్రమంలో చిరుతపులి ఆమెపై కూడా దాడిచేసింది. అయినా కిరణ్ ఏమాత్రం ఒణకలేదు... బెణకలేదు. చివరకు ఆ తల్లి చేతిలో చిరుతపులి ఓడిపోయి బిడ్డను వదిలేసి వెళ్లిపోయింది. కిరణ్ అరుపులకు సమీపంలోని వాళ్లంతా వచ్చారు. ఆ చిరుతపులిని ఊరి బయటకు తరిమి అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిరుత దాడిలో ఆ పిల్లాడు ఎంతగానో గాయపడ్డాడు. ఆ బిడ్డ శరీరంపై పులి గాట్లతోపాటు వీపు, చెంపలు, కళ్లపై తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ తల్లి ధైర్యానికి హ్యట్సాఫ్ చెప్పాల్సిందే..












Click it and Unblock the Notifications