డెత్ మిస్టరీ: ఆత్మహత్య చేసుకున్న అదనపు డీజీపీ: భార్య ఐఎఎస్.. సీఎంతో కలిసి జపాన్ లో టూర్
సీనియర్ ఐపీఎస్ అధికారి, హర్యానా అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో చండీగఢ్ సెక్టార్ 11లో గల తన అధికారిక నివాసంలో ఆయన బలవన్మరణనానికి పాల్పడ్డారు. సర్వీస్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పూరన్ కుమార్- 2001 బ్యాచ్ హర్యానా హర్యానా క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి పోలీస్ అధికారి. సెప్టెంబర్ 29న రోహ్‌తక్‌లోని సునారియాలో గల పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (PTC)లో ఐజీగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానా పోలీసులు అధికారికంగా ఆయన సెలవును ధృవీకరించలేదు. సెక్టార్ 11లోని కోఠీ నంబర్ 116లో నివాసం ఉంటున్నారు. ఇందులో మూడు అంతస్తులు ఉన్నాయి. ప్రతి అంతస్తులో వేర్వేరు కుటుంబాలు నివసిస్తున్నాయి.

పూరన్ కుమార్ కుటుంబం గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తోంది. ఆయా కుటుంబాలన్నీ కలిసి ఓ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ నుండి గార్డులను నియమించుకున్నాయి. సెక్యూరిటీ గార్డులే పోలీసులకు కాల్ చేసి కాల్పుల గురించి సమాచారం అందించారు. పూరన్ కుమార్ నివసించే భవనానికి ఎదురుగా ఉన్న ఇంట్లో నిర్మాణం జరుగుతోంది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు, తాము కాల్పుల శబ్దం వినలేదని తెలిపారు. అకస్మాత్తుగా మధ్యాహ్నం 2 గంటలకు పోలీసు వాహనాలు అక్కడికి రావడంతో, ఈ విషయం తెలిసిందని వివరించారు.
ఆయన భార్య అమనీత్ పీ కుమార్.. ఐఎఎస్ అధికారిణి. ముఖ్యమంత్రి నాయబ్ సైనీతో కలిసి జపాన్‌కు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంలో ఆమె సభ్యురాలు. ఈ నెల 5వ తేదీన అమనీత్.. సీఎం, ఆయన టీమ్ తో కలిసి జపాన్ బయలుదేరి వెళ్లారు. 8 సాయంత్రం తిరిగి రావాల్సి ఉంది.
పూరన్ కుమార్ సహా కొంతమంది ఐపీఎస్ అధికారుల పదోన్నతులపై కొంతకాలంగా వివాదాలు తలెత్తుతున్నాయి. వారందరూ కూడా 1991, 1996, 1997, 2005 బ్యాచ్‌కు చెందినవారు. అక్రమంగా పదోన్నతులు పొందారంటూ ముఖ్యమంత్రి నాయబ్ సైనీకి లేఖ సైతం రాశారు. సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ఈ పదోన్నతులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. 2001 బ్యాచ్ అధికారులకు డీఐజీగా పదోన్నతులు ఇచ్చేటప్పుడు హోం మంత్రిత్వ శాఖ నిబంధనలను పాటించలేదనే ఫిర్యాదులు అందాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications